YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

బీఎండబ్ల్యూ కారు లో వచ్చి దొంగతనం

బీఎండబ్ల్యూ కారు లో వచ్చి దొంగతనం

బీఎండబ్ల్యూ కారు లో వచ్చి దొంగతనం
హై ప్రొఫైల్ దొంగగా ఆరిఫ్
హైద్రాబాద్, అక్టోబరు 4,
టిక్కు….టాక్కు డ్రెస్ వేస్తాడు…. ఎవరికి అనుమానం రాకుండా ఉన్నత కుటుంబానికి చెందినవాడిలా కనిపిస్తాడు. విమానాల్లో తిరుగుతాడు. దీంతో అందరూ ఏమనుకుంటారు ఇతడేదో పెద్ద బిజినెస్ మాగ్నెట్ అనుకుంటారు. మరి అతడేం చేస్తాడో తెలుసా మీరే చదవండిఅది పేరొందిన బంజారాహిల్స్ ప్రాంతం. ఇక్కడ ఎక్కవ మంది ఉన్నత కుటుంబాలకే చెందిన వారుంటారు. ఈ ప్రాంతాల్లో బీఎండబ్ల్యూ కార్లలో తిరుగుతుండడంతో ఎవరికి అనుమానం వస్తుంది. కాని అతడు అక్కడే సంచరిస్తుంటాడు. ఏ రాష్ట్రాల్లో బంజారాహిల్స్ లాంటి ప్రాంతాలుంటాయో గాలిస్తాడు. రెక్కీ చేస్తాడు ఆ తరువాత అక్కడ వాలిపోతాడు. ఇలా హై ఫైలా ఉన్న వారిని ఎవరు అనుమానిస్తారు. ఎవరూ అనుమానించరు అదే అతడికి వరమైంది.అతడిపేరే ఆరిఫ్. బీహార్ కు చెందినవాడు. ఇతని వృత్తి ప్రవృత్తి దొంగతనాలే. అయితే చోటా మోటా చోరీలు మాత్రం చేయడు. స్కెచ్ వేస్తే పెద్దపెద్దవే వేసేస్తాడు. బెంగుళూరు, కర్ణాటక ప్రాంతాల్లో భారీ చోరీలు చేశాడు. సింగిల్ గా వచ్చి టంచన్ గా కొట్టేయడంలో ఆరిఫ్ ఆరితేరాడు. కొంతకాలంగా ఇతనికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్నో చోరీ కేసుల్లో ఆరిఫ్ పాత్ర ఉందని తేలింది. కాని అతడు మాత్రం ఏ రాష్ట్ర పోలీసులకు చిక్కలేదు. దీంతో అతడిని మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చారు.ఇటీవల బంజారాహిల్స్ లోని సుబ్బరామిరెడ్డి అన్న కుమారుడు ఉత్తమ్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు రెండు న్నర కోట్ల విలువైన వజ్రాభరణాలు , ఇతర వస్తువులు చోరీ అయ్యాయి. ఈ కేసును పరిశీలించిన స్థానిక పోలీసులు తమతో కాదని కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. మోస్ట్ వాంటెడ్ లో ఉన్న ఆరిఫ్ కోసం బెంగుళూరు పోలీసులు గాలిస్తుండగాఎట్టకేలకు ఓ కేసులో వారికి చిక్కాడు. దీంతో అతడ్ని విచారించగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఉత్తం ఇంట్లో చోరీ చేసినట్లు అంగీకరించాడు. ఈ సమాచారం అందుకున్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బెంగుళూరు వెళ్లి ఆరిఫ్ ను విచారించారు. మొత్తానికి ఉత్తం ఇంట్లోచోరీ చేసింది. ఆరిఫ్ అని తేలింది. ఆరిఫ్ ను పోలీసులు హైదరాబాదుకు తీసుకువచ్చారు. మొత్తం 16 రాష్ట్రాల్లో ఆరిఫ్ చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. అయితే అతడి వద్ద నుంచి ఆ వజ్రాభరణాలను రికవరీ చేయాల్సి ఉంది

Related Posts