YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నియోజవర్గానికి పరిమితమైన పయ్యువుల

నియోజవర్గానికి పరిమితమైన పయ్యువుల

నియోజవర్గానికి పరిమితమైన పయ్యువుల
అనంతపురం, అక్టోబరు 4,
సీనీయర్ నేత పయ్యావుల కేశవ్ ఇప్పడు వైసీపీ సర్కార్ కు టార్గెట్ అయినట్లు కన్పిస్తుంది. పయ్యావుల కేశవ్ ఇప్పుడు పీఏసీ ఛైర్మన్ గా కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో రెండు సీట్లు గెలిస్తే ఒకటి నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం, రెండోది పయ్యావుల పోటీ చేసి ఉరవకొండ నియోజకవర్గాలు మాత్రమే. అయితే పయ్యావుల కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అంత దూకుడుగా లేరు. గతంలో వైఎస్ హయాంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ మీడియా ముందు ఉండే పయ్యావుల ఇప్పుడు మాత్రం దూరంగానే ఉంటున్నారు.వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లో కూడా ఆయన పెద్దగా కన్పించడం లేదు. ఒకరకంగా పయ్యావులలో ఇంతకు ముందు స్పార్క్ లేదు. అయితే పయ్యావుల కేశవ్ ను కట్టడి చేయాలన్నదే స్థానిక మాజీ ఎమ్మెల్యే విశ్వశ్వరరెడ్డి తరచూ ప్రయత్నిస్తుండటం వివాదాలకు దారి తీస్తుంది. పయ్యావుల సొంత గ్రామమైన కౌకుంట్ల పంచాయతీని విభజించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఇక్కడ పయ్యావుల కేశవ్ కు పట్టు ఉండటంతో దాన్ని విభజించి పయ్యావుల కేశవ్ ఆధిపత్యానికి గండి కొట్టాలని భావిస్తున్నారుఅయితే ఇప్పటి వరకూ ప్రభుత్వంపై విమర్శలకు దూరంగా ఉన్న పయ్యావుల కేశవ్ తన నియోజకవర్గానికి వచ్చే సరికి మాత్రం స్వరం పెంచారు. కౌకుంట్ల పంచాయతీని విభజించాలని ప్రభుత్వం జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ రణంగా మారింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణను పయ్యావుల అనుచరులు అడ్డుకున్నారు. పయ్యావుల బలాన్ని తగ్గించి వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందడానికే వైసీపీ ప్రభుత్వం పంచాయతీ విభజనకు శ్రీకారంచుట్టిందన్నది పయ్యావుల కేశవ్ ఆరోపణ. దీనిపై తాము ఎంతవరకైనా పోరాడతామని పయ్యావుల కేశవ్ స్పష్టం చేస్తున్నారు.అలాగే ముద్దలా పురం, ఇప్పేరు చెరువలకు నీటి విడుదల విషయంలో కూడా పయ్యావల కేశవ్ ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. ఇలా పయ్యావుల కేశవ్ రాష్ట్ర స్థాయి సమస్యలను పెద్దగా పట్టించుకోవడం లేదు.కేవలం తన నియోజకవర్గ సమస్యలకే పరిమితమయ్యారు. నిజానికి పయ్యావుల కేశవ్ నియోజకవర్గంపైనే దృష్టి పెట్టడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు తాను ఏం చేసినా ఫలితం ఉండదని, వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాన్ని కాపాడుకోవడమే తన ముఖ్య ఉద్దేశ్యమని పయ్యావుల కేశవ్ భావిస్తున్నట్లుంది

Related Posts