క్యాత్ ల్యాబ్ ను ప్రారంభించని మంత్రి ఈటల
సిద్దిపేట, అక్టోబరు 4,
సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామం వద్ద గల ఆర్.వి.ఎం హాస్పిటల్ లో క్యాత్ ల్యాబ్(గుండె సంబంధిత వ్యాధి ల్యాబ్ ) ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రం లో తెలంగాణ ప్రాంతానికి మూడు మెడికల్ కాలేజీలు లు ఉంటే కేసీఆర్ కృషితో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం లో పదకొండు మెడికల్
కాలేజీలు తెచ్చుకున్నాం. మరో మూదు మెడికల్ కాలేజీలకు కృషి చేస్తున్నామన్నారు. bsp;తెలంగాణ ప్రజలు క్లోరైడ్ నీళ్లతో అనారోగ్యాలకు గురవుతున్నారని, తెలంగాణ ప్రజలకు సర్ఫస్
వాటర్ అందించాలని మిషన్ భగీరథ పతకం ద్వారా ప్రజలకు త్రాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బంగారు తెలంగాణాకు బాటలు వేయాలంటే ఆరోగ్యవంతమైన
తెలంగాణ కావాలని మన ముఖ్యమంత్రి ఆలోచన అని అన్నారు. గ్లోబల్ వార్మింగ్ గురించి దేశాలు లక్షలు కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ వార్మింగ్ గురించి
మాట్లాడకుండా మనిషికి మంచి వాయువు అందాలని కొన్ని కోట్ల కొద్దీ మొక్కలు నాటి హరితహారాన్ని అవివృద్ది చేస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని మంత్రి అన్నారు