మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఉపాధ్యాయురాలు
నల్గోండ అక్టోబర్ 4
నల్లగోండ జిల్లా ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ పోస్టు కోసం ఒక ఉపాధ్యాయురాలు ఏకంగా రాష్ట్ర మంత్రి కేటిఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి విధుల్లో చేరిన సంఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మిర్యాలగూడ మండలం రావులపెంట జెడ్సీ బాలికల హైస్కూల్ నోపాధ్యాయురాలిగా ఉన్న మంగళ ఒపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ గా కుడా వ్యవహరిస్తుంది.. రెండు వారాల కిందట ఆమెను ఇంచార్జి బాధ్యతల నుంచి తోలగించాలని కమిషనర్ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారికి లెటర్ వచ్చింది. అయితే అదే పోస్టుకు సూర్యాపేట కు చెందిన మరోక స్కూల్ అసిస్టెంట్ ఉపాద్యాయునికి ఇంచార్జ్ భాద్యతలు అప్పగిస్తు ఉత్వర్వులు అందాయి. అయితే జిల్లా విద్యాశాఖ అధికారి అతన్ని విధుల్లో చేర్చుకోలేదు. ఇది అదనుగా చేసుకున్న మంగళ, మంత్రి కెటిఆర్ సంతకంతో రికమెండేషన్ లెటర్ ఫోర్జరీ చేసి విధుల్లో చేరింది. దీంతో ఒక్కసారిగా ఆమెపై ఆరోపణలు లేవనేత్తాయి. అదికారులు దిద్దు బాటు చర్యలు చేపట్టగా మంత్రి పేషి విచారణ చేపట్టింది.