బయో మెథనైజేషన్ ప్లాంటును ప్రారంభించిన మేయర్
హైదరాబాద్, అక్టోబర్ 4 (న్యూస్ పల్స్)
చందానగర్ సర్కిల్ దీప్తిశ్రీ నగర్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటుచేసిన బయోమెథనైజేషన్ ప్లాంటును నగర మెయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఏర్పాటుచేసిన ప్లాంట్ ప్రారంభోత్సవంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జోనల్ కమిషనర్ హరి చందన, స్థానిక కార్పోరేటర్ నవత రెడ్డి, హెచ్ ఏ ఎల్ అధికారులు పాల్గోన్నారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు ఒక మెట్రిక్ టన్ తడి చెత్త తో 80 క్యూబిక్ పరిమాణం గల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతోంది. ఈ 80 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ ద్వారా 16 గంటలపాటు నిరంతర జ్వాల ఉంటుంది మేయర్ మాట్లాడుతూ ఈ ప్లాంట్ కెపాసిటీని కు పెంచే ప్రతిపాదన ఉందని అన్నారు. ఇదే విధమైన గ్యాస్ ప్లాంట్లను నగరంలోని స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నా. గ్రేటర్ హైదరాబాద్ లో బల్క్ గార్బేజ్ ను ఉత్పత్తి చేసే స్టార్ హోటల్, గేటెడ్ కమ్యూనిటీలు, సంస్థలలో తడి చెత్త నుండి బయోగ్యాస్ ఉత్పత్తి
ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని అయన అన్నారు.