YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

జర్నలిస్డుల సంక్షేమాన్ని విస్మరించిన తెలంగాణ ప్రభుత్వం

జర్నలిస్డుల సంక్షేమాన్ని విస్మరించిన తెలంగాణ ప్రభుత్వం
జర్నలిస్డుల సంక్షేమాన్ని విస్మరించిన తెలంగాణ ప్రభుత్వం - టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర నాయకులు కూతురు రాజిరెడ్డి సిద్దిపేట, అక్టోబర్ 04 : తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూతురు రాజిరెడ్డి అన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా యూనియన్ నేతలు, జర్నలిస్టులు సిద్దిపేట ఆర్డిఓకార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో కార్యాలయ ఏవో సాజిత్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపినప్పటికీ ఏ ఒక్క పథకం కూడా కార్యరూపందాల్చడం లేదని వాపోయారు. అక్రిడేషన్ విషయంలో239 జీవో ను సాకుగా చూపి చిన్న పత్రికలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా జర్నలిస్టు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించడంతో పాటు, ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ లు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక చుకున్నామన , ఈ ప్రణాళికలో భాగంగా అక్టోబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ నేతలు ఎం.డి. ఫయాజ్, చిటుకుల మైసారెడ్డి,జనార్థన్,పాతర్ల వెంకటేశ్వర్లు, జికూరి పరమేశ్వర్, వెంకన్న, సతీష్, సాజిద్, జర్నలిస్టులు వెంకట్, వడ్లకొండ శ్రీనివాస్, కరుణాకర్ రెడ్డి, స్వామి, చొప్పరి రాములు, సుజిత్ రెడ్డి, నాగరాజు, శీను, రాంరెడ్డి, నరేష్, ఇంద్ర శేఖర్, వంశీ, వాజిద్, సయ్యద్, గోల్డెన్ నగేష్, వికాస్, యాదగిరి, ప్రసాద్, శ్రీనివాస్, విజయేంద్ర ప్రసాద్, మురళీ, దయానంద, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts