YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

త్రాగు నీరు అందించడంలో అధికారులు,కాంట్రాక్టర్లు విఫలం జ్వరాలతో బాధ పడుతున్న గ్రామ ప్రజలు

త్రాగు నీరు అందించడంలో అధికారులు,కాంట్రాక్టర్లు విఫలం జ్వరాలతో బాధ పడుతున్న గ్రామ ప్రజలు
త్రాగు నీరు అందించడంలో అధికారులు,కాంట్రాక్టర్లు విఫలం జ్వరాలతో బాధ పడుతున్న గ్రామ ప్రజలు కౌతాలం అక్టోబరు 4 (న్యూస్ పల్స్): కౌతాళం మండలంలో త్రాగు నీరు అందించడంలో అధికారులు కాంట్రాక్టర్లు విఫలం అయ్యారని, నీరు తాగి విష జ్వరాలతో బాధ పడుతున్నారని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం లో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పేర్కొన్నారు.వారు మాట్లాడుతూ గత నెల 30 వ తారీఖున సోమవారం రోజున తహశీల్దార్ చంద్రశేఖర్ వర్మ కు అర్ డబ్లు ఎస్ ఏ ఈ గారికి పంచాయతీ కార్యదర్శి గారికి తాగునీరు శుద్ధి లేకుండా అలాగే సరఫరా చేస్తున్నారని విషయం తెలుపగ అలాంటిదేమి లేదు ఫిల్టర్ చేసి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఆ విషయమై మీరు ఎక్కడ శుద్ధి చేస్తున్నారో మాకు చూపగలరు. అని మేము కోరగా అధికారులు సరే వెళదాం రండి అని ఎస్ ఎస్ ట్యాంకు దగ్గరికి తీసుకెళ్లారు. ట్యాంక్ నిండా నీళ్లు పాచి మరియు వ్యర్థ పదార్థాలతో నిండి ఉంది. ఇదేంటని మేము ప్రశ్నించగా అధికారులు నీళ్లు నములుతూ సరియైన సమాధానం చెప్పలేకపోయారు. దినికి సంబంధిత వ్యక్తులు ఎవరు అని ప్రశ్నించగా ఒక్క అధికారి కూడా సరియైన సమాధానం చెప్పలేకపోయారు. ఇదే విషయమై అర్ డబ్ల్యూ ఎస్ డి ఇ శివ నాగేశ్వరావు కు ఫోన్ ద్వారా వివరణ కోరగా ఎస్ ఎస్ ట్యాంకు మరియు ఫిల్టర్ బెడ్ వాటికి సంబంధించిన వ్యవహారాలు మొత్తం ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ చూసుకుంటారని తెలిపారు. కాంట్రాక్టర్ ఎవరు ఎందుకు అయన పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదా అని మేము ప్రశ్నించాగ కాంట్రాక్టర్ కు మేము చాలా సార్లు హెచ్చరించాము. కానీ అయన నుంచి ఎటువంటి సమాధానం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరనీ, మీరు ఎవరికైన చెప్పుకోండి అని చాలా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని సమాధానం తెలిపారు. కావున కాంట్రాక్టర్ ఎవరు మాకు తెలపగలరు. అని మేము కోరగా సమాధానం చెప్పకుండా మాట దాటవేశారు. ప్రజలా ఆరోగ్యాలతో చెలగతమాడుతున్న కాంట్రాక్టర్ ను తొలగించి కొత్త కాంట్రాక్టర్ తీసుకోవలసిందిగా కోరుచున్నాము.కాంట్రాక్టర్ పేరు అడిగితే అధికారులు లేకపోతున్నారు.కావున కాంట్రాక్టర్ కు అధికారులకు చీకటి ఒప్పందం ఏమిటి అని బీజేపీ రామక్రిష్ణ ప్రశ్నిస్తున్నారు.అధికారులు మాకు సమయం ఇవ్వండి పరిస్కారం చేస్తామని హామీ ఇచ్చారు.కని ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం లేదు.6 వ తేదీన లోపల పనులు పూర్తి చేయాలి లేని యడల 7 వ తారీఖున భారీఎత్తున ర్యాలీ నిర్వహించి పంచాయతీ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో రామచంద్ర, నబీసాబ్ యాంకన్నా, నరేంద్ర, మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts