వార్తలు రాజకీయం నేరాలు దేశీయం
బాలాకోట్ దాడులు ఇలా చేశాం
న్యూఢిల్లీ, అక్టోబరు 4 :
పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బాలాకోట్ ఉగ్రవాద స్థావరంపై మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 300 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని భారత ప్రధాని మోదీ ప్రకటించారు. బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్‌కు సంబంధించిన ప్రమోషనల్ వీడియాను ఎయిర్‌ఫోర్స్ రిలీజ్ చేసింది. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఎయిర్స్ ఫోర్స్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా ఈ వీడియోను ప్రదర్శించారు.ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పైలట్లు ఓ రూమ్‌లో మాట్లాడుంటుకున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తాయి. తర్వాత యుద్ధ విమానాల దగ్గరకు పైలెట్లు పరిగెత్తుకుంటూ వెళ్లిన దృశ్యాలను చూడొచ్చు.84 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఐఏఎఫ్ యుద్ధ విమానాలు టేకాఫ్ తీసుకుని బాలాకోట్ ప్రాంతంలో ఉగ్రశిబిరాలే లక్ష్యంగా బాంబులను జారవిడిచి, ధ్వంసం చేయడం చూడొచ్చు. భారత్, పాక్ యుద్ధ విమానాల మధ్య జరిగిన డాగ్ ఫైట్‌ను కూడా ఈ వీడియోలో చూడొచ్చు. భారత్ బాలాకోట్‌లో దాడులే చేయలేదంటున్న వారికి ఈ వీడియో రూపంలో ఎయిర్‌ఫోర్స్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చినట్లయ్యింది
బాలాకోట్ దాడులు ఇలా చేశాం