YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం విదేశీయం

విమాన సిబ్బంది నిర్లక్ష్యం...

విమాన సిబ్బంది నిర్లక్ష్యం...
విమాన సిబ్బంది నిర్లక్ష్యం... న్యూఢిల్లీ, అక్టోబరు 4 : విమాన ప్రయాణమే కాదు.. ఇప్పుడు విమాన సిబ్బంది కూడా ప్రయాణికులను భయపెడుతున్నారు. ఒకప్పుడు విమాన సిబ్బంది అంటే మర్యాదకు మారు పేరని, ప్రయాణికుల బాగోగులు చూడటంలో వారి తర్వాతే మరెవ్వరైనా అనే భావన ఉండేది. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. సిబ్బంది తీరు కూడా మారింది. సహనంతో మెలగాల్సిన ఉద్యోగులు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు.గతంలో ఇండిగో సిబ్బంది ఓ ప్రయాణికుడిపై దాడి చేయడం వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పలు విమానయాన సంస్థల్లో అలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఎయిర్ కెనడా విమాన సిబ్బంది ఓ ప్రయాణికురాలితో అమానవీయంగా ప్రవర్తించి వార్తల్లోకెక్కారు.టొరంటో వెళ్లేందుకు విమానం ఎక్కిన ఓ మహిళ.. టాయిలెట్‌‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. విమానం ఆగి ఉందని, ఈ సమయంలో టాయిలెట్ వాడకూడదని వెనక్కి పంపేశారు. ఎంతసేపైనా విమానం కదలకపోవడంతో ఆమె మరోసారి టాయిలెట్‌ ఉపయోగించేందుకు ప్రయత్నించింది. అయితే, ఈసారి కూడా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. రెండు గంటల వ్యవధిలో సుమారు నాలుగుసార్లు టాయిలెట్‌కు అనుమతించాలని కోరింది. ఇక ఆపుకోలేక ఆమె కూర్చున్న సీట్లోనే మూత్రం పోసింది.ఇతర ప్రయాణికులకు ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని భావించి.. ఆమె ఆ సీట్లోనే కూర్చొని ఏడు గంటల సేపు ప్రయాణించింది. టొరంటోలో దిగిన తర్వాత హోటల్‌కు వెళ్లి దుస్తులు మార్చుకుంది. ఈ భయానక ఘటనపై ఆమె ఎయిర్ కెనడాకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు. పరిహారంగా రూ.35,568 విలువ చేసే ఫ్లైట్ వోచర్ ఇస్తామని పేర్కొన్నారు.

Related Posts