YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కిడారికి వైసీపీలో మూసుకుపోయిన దార్లు

కిడారికి వైసీపీలో మూసుకుపోయిన దార్లు

కిడారికి వైసీపీలో మూసుకుపోయిన దార్లు
విజయనగరం, అక్టోబరు 5,
మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ చాన్నాళ్ళ తరువాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. వైసీపీ సర్కార్ మీద ఘాటు విమర్శలు చేశారు. దాంతో కిడారి రూట్ ఏంటో కొంచం క్లారిటీ వచ్చిందని అంటున్నారు. నిజానికి కిడారి శ్రావణ్ కుమార్ కి రాజకీయం అన్నది వృత్తి కాదు, తండ్రి కిడారి సర్వేశ్వరరావు హఠాత్తుగా మావోయిస్టుల చేతుల్లో చనిపోవడంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తరువాత ఆరు నెలల పాటు కిడారి శ్రావణ్ కుమార్ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే మంత్రిగా ఆయన ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. అంతే కాదు ఆయన ఇంకా రాజకీయం వంటబట్టించుకోకుండా బాధ్యత గల మంత్రిగా వ్యవహరించలేదని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో అరకు ఎమ్మెల్యే సీటుకు కిడారి శ్రావణ్ కుమార్ పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.కిడారి శ్రావణ్ కుమార్ ఓడిపోయిన తరువాత చాన్నాళ్ళ పాటు రాజకీయాలవైపు తొంగి చూడలేదు. మౌనంగానే గడిపారు. ఆయన అసలు రాజకీయాల్లో కొనసాగరని కూడా ప్రచారం సాగింది. అది కూడా నిజమే అనుకున్నారు. యాక్సిడెంటల్ గా రాజకీయాల్లోకి రావడం వల్ల కిడారి శ్రావణ్ కుమార్ కధ ఇంతటితో సరి అనుకున్నారు. ఇంకో వైపు విశాఖ జిల్లాలో టీడీపీ పరిస్థితి కూడా అంతగా బాగాలేకపోవడంతో నేతలు కూడా ఎవరు దారి వారు చూసుకుంటున్న నేపధ్యం ఉంది. దాంతో కిడారి శ్రావణ్ కుమార్ ఇక ఈ వైపునకు రారు అనుకున్నారు. ఈ దేశంలోనే రాజకీయాల్లో ఉండాలా, లేక వేరే మార్గంలోకి పోవాలా అన్న చర్చ కూడా కిడారి కుటుంబంలో జరిగినట్లు తెలిసింది. బాగా చదువుకున్న కిడారి శ్రావణ్ కుమార్ ఉన్నత ఉద్యోగం వైపు వెళ్తున్న సమయంలోనే మంత్రి అయ్యారు. మరి ఇపుడు ఆయన తన ముందు జీవితాన్ని కూడా రాజకీయాల్లోనే గడపాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అందువల్లనే ఆయన ఈ వైపుగా వచ్చారని అంటున్నారు.కిడారి శ్రావణ్ కుమార్ మొదట వైసీపీ వైపుగానే వెళ్లాలని అనుకున్నారు కానీ అక్కడ ఆయనకు అవకాశం దక్కకపోవడంతో ఆయన టీడీపీలోనే ఉండాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పైగా అరకులో టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడం కూడా కిడారికి ఒక అవకాశంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో కిడారి శ్రావణ్ కుమార్ రాజకీయ విమర్శలకు పదును పెట్టడం ద్వారా టీడీపీ అధినాయకత్వానికి చేరువ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నారు. బాక్సైట్ తవ్వకాలపైన టీడీపీ జారీ చేసిన జీవోను వైసీపీ రద్దు చేయడం పట్ల కిడారి శ్రావణ్ కుమార్ స్పందిస్తూ అది పూర్తిగా తప్పుడు ప్రచారం అన్నారు. అసలు ఆ జీవోను రద్దు చేసింది టీడీపీ సర్కార్ అయితే దాన్ని మళ్ళీ రద్దు చేశామని చెప్పుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. గిరిజన మంత్రిగా అసలైన గిరిజనులను నియమించకుండా కురుపాం ఎమ్మెల్యేని నియమించడాన్ని కూడా కిడారి శ్రావణ్ కుమార్ తప్పుపట్టారు. గిరిజనులకు చంద్రబాబు బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేస్తే జగన్ సర్కార్ వాటిని కుదించిందని కూడా అన్నారు. మొత్తానికి ఇన్నాళ్ళకు కిడారి శ్రావణ్ కుమార్ మీడియా ముందుకు వచ్చి వైసీపీ పై ఘాటు విమర్శలు చేయడం ద్వారా తన దారి ఎటో చెప్పకేనే చెప్పారు

Related Posts