నెల్లూరు జిల్లాలో 2లక్షల మందికి పథకం ఫలాలు
నెల్లూరు, అక్టోబరు 5,
ప్రభుత్వ నిబంధనలు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వెరసి వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం జిల్లాలో కొందరికే పరిమితం కానుంది. అక్టోబరు 15వ తేదీ నుంచి ఆపథకం ద్వారా అర్హులైన రైతులకు రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 18 నుంచి ప్రారంభమైన దరఖాస్తులు స్వీకరణ నేటి సాయంత్రంతో గడువు తేదీ ముగియనుంది. ఇప్పటికి జిల్లా వ్యవసాయ అధికారులు పరిశీలించిన దరఖాస్తుల్లో 70 వేలకు పైగా సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ఫలితంగా అదనంగా మరో 1.30 లక్షల మంది ఆ పథకానికి దూరమయ్యారు.ప్రభుత్వ నిబంధనలు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వెరసి వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం కొందరికే పరిమితం కానుంది. అక్టోబరు 15వ తేదీ నుంచి వైయస్‌ఆర్ రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రభుత్వం రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపింది. గత నెల 18వ తేదీనుంచి విలేజి వాలంటీర్ల సాయంతో జిల్లాలో సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటికే ఆర్‌టిజిఎస్ ద్వారా వ్వవసాయ శాఖ వద్ద ఉన్న 2,52,439 మంది రైతుల దరఖాస్తులతో పాటు అదనంగా 46 మండలాల్లో మరో 56 వేల దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 3.08 లక్షల మంది రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వాటిలో శుక్రవారం సాయంత్రానికి 60 శాతం వెరిఫికేషన్ పూర్తయింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని అర్హతలు ఉండి సాంకేతిక సమస్యల కారణంగా అత్యధికంగా రైతులు అనర్హులుగా మిగలనున్నట్లు తెలిసింది. సాంకేతిక సమస్యలు రీత్యా గడువు తేదీలో మార్పు చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.వ్యవసాయ, ఉద్యాన, మల్బరీ సాగు రైతులు ఈ పథకానికి అర్హులు. జిల్లాలో భూముల సర్వే నెంబర్లతో రైతుల ఆధార్ నెంబర్లు లింక్ చేయకపోవడం, రైతులు ప్రజాసాధికార సర్వేలో నమోదు చేయించకపోవడం, పాస్‌పుస్తకాలు అందరి వద్దా లేకపోవడం, వెబ్‌లాండ్ నమోదు చేయించుకోకపోవడం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యలపై రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. అదే విధంగా ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఒక భూ యజమానికి ఒక కౌలు రైతుకు మాత్రమే ఈ పథకం పరిమితమైంది. 1.25 ఎకరా మాగాణి, లేదా 2.5 ఎకరా మెట్ట కలిగిన భూ యజమాని కౌలుకు ఇచ్చేందుకు అర్హులు కాదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. భూ యజమానికి పొలం ఉన్న గ్రామంలో కౌలు రైతు నివాసం ఉంటేనే అర్హతగా పరగణించారు..కౌలుకు వ్యవసాయమునకు ఒక ఎకరా, ఉద్యాన పంటలకు అర ఎకరా, తమల పాకు సాగుకు 10 సెంట్లు తీసుకున్న అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎస్సీ,ఎస్టీ, బిసి మైనార్టీ కైలు రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అగ్రవర్ణాల్లో పేదలున్నప్పటికీ వారికి రైతు భరోసా దూరమైంది.జిల్లాలో చిన్న, సన్నకారు రైతులు 4 లక్షలకు పైగా ఉన్నారని ఒక అంచనా. సాంకేతిక సమస్యల ఫలితంగా లక్ష మంది, ప్రభుత్వ నిబంధనల ఫలితంగా లక్ష మంది ఆ పథకానికి దూరం కానున్నారని సమాచారం. గత కొన్ని రోజులు స్వీకరించిన ధరకాస్తులు, గతంలో ఉన్న రికార్డుల ఆధారంగా 3.08 లక్షల మంది మాత్రమే ఉన్నారని గుర్తించారు. శుక్రవారం సాయంత్రానికి 1.80 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఆ దరఖాస్తులలో 70 వేలకు పైగా దరఖాస్తులకు సంబంధించి సాంకేతిక సమస్యలున్నాయని గుర్తించారు. నేటి సాయంత్రానికి మరో 1.30 లక్షల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. ఆ దరఖాస్తులలోనూ సుమారు అంచనాగా 35 శాతంగా సాంకేతిక సమస్యలుంటే మరో 40 వేలకు చేరే అవకాశం ఉంది. మొత్తం సాంకేతిక సమస్యలు కారణంగా లక్ష మంది దూరం కానున్నారు.