YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఒకరిద్దరికే మంచి మార్కులు

ఒకరిద్దరికే మంచి మార్కులు

ఒకరిద్దరికే మంచి మార్కులు
విజయవాడ, అక్టోబరు 5,
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దూసుకు వెళుతున్నారు. దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాసమస్యలను ఒక్కొక్కటి గా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. నవరత్నాలను అమలు చేయడంపైనే దృష్టిపెట్టారు. నవరత్నాలతో పాటు ప్రజాసంకల్ప పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను కూడా జగన్ విస్మరించడం లేదు. గుర్తు పెట్టుకుని మరీ ఆయన అమలు చేస్తున్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై నిషేధం ఈ కోవకు చెందినదే.అయితే వరగా జగన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు, నవరత్నాల అమలు, జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లడం లేదు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రచారాన్ని నిర్వహిచడం లేదు. దీంతో విపక్షాలు చేస్తున్న విమర్శలే ఎక్కువగా ప్రజలకు చేరుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంటే ఆ స్పీడ్ ను అధికారులు, మంత్రులు అందుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణ సమయంలోనే రెండున్నరేళ్లు మాత్రమే వీరు పదవిలో ఉంటారని చెప్పారు. ఈ రెండున్నరేళ్లలో తమ ప్రతిభను చూపించుకోవాల్సిన మంత్రులు పూర్తిగా వెనకబడి పోయారు. ఒకరిద్దరు మినహా మంత్రులు ఎవరూ యాక్టివ్ గా లేరు. ఏం మాట్లాడితే ఏ సమస్య వస్తుందోనన్న ఆందోళన మంత్రుల్లో స్పష్టంగా కన్పిస్తుంది. జగన్ అంచనాలను వీరు అందుకోలేక పోతున్నారని పార్టీలో సీనియర్ నేతలు సయితం అభిప్రాయపడుతున్నారు.మహిళా బిల్లు, యాభైశాతం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిల్లు మొత్తం 19 బిల్లులను ఇటీవల జరిగిన శాసనసభలో ఆమోదించారు. వీటికి సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే క్షేత్రస్థాయిలో వీటికి ప్రచారం లభించడం లేదు. మంత్రులు తమ ఛాంబర్లకో, నియోజకవర్గాలకో పరిమితం అవుతున్నారు. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు కూడా అధికార పక్షం నుంచి సమాధానం రావడం లేదు. జగన్ ఈ టీంతో రెండున్నరేళ్లు నెగ్గుకు రావడం కష్టమేనన్న వ్యాఖ్యలు పార్టీలో విన్పిస్తున్నాయి. ఆరు నెలల తర్వాత మంత్రుల పనితీరుపై సమీక్ష జరిపి కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందేనని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Related Posts