YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

పందుల విరుగుడుకు యంత్రం

పందుల విరుగుడుకు యంత్రం

పందుల విరుగుడుకు యంత్రం
నిజామాబాద్, అక్టోబరు 5,
విత్తు నుంచి కోత వరకు నిత్య పోరాటం చేసే అన్నదాతలు జంతువులు, పక్షుల నుంచి పంటలను కాపాడుకునేందుకు పడే శ్రమ అంతా ఇంతా కాదు. అడవి పందులు, కోతులు, పక్షుల రాకుండా చూసుకునేందుకు రాత్రింబవళ్లు పొలాల దగ్గరే కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో నిజామాబాద్ జిల్లా ఏర్గట్లకు చెందిన పొత్తూరి మహేష్ రూపొందించిన ఈ పరికరం రైతుల చింతను తీర్చే ఆయుధంగా మారింది. పీవీసీ పైపులు, కప్లింగ్‌లు, లైటర్ , కార్బెట్ సాయంతో రూపొందించిన ఈ పరికరం జంతువులు పొలంలోకి రాకుండా ఎంతగానో ఉపయోగపడుతోంది. పైప్‌కు ఓ చోట రంధ్రం చేసి అందులో కార్బైట్ వేస్తున్నాడు. దీనికి నీరు తోడయితే మండే స్వభావం ఉండటం వల్ల వీటితో కొద్దిగా నీటి చుక్కలు వేసి తరువాత రంధ్రాన్ని మూసి వేస్తాడు. పైప్ లోపల రసాయన చర్య ప్రారంభమైన తరువాత లైటర్ ద్వారా పేలుస్తున్నాడు. దీని వల్ల పెద్ద పెద్ద శబ్ధాలు రావడంతో పక్షులు, కోతులు పరారవుతున్నాయి. కేవలం 420 రూపాయలతో ఈ యంత్రాన్ని రూపొందించినట్టు మహేష్ చెబుతున్నారు.  ఈ పరికరం గురించి తెలుసుకున్న వ్యవసాయ అధికారులు స్వయంగా వచ్చి పరిశీలిస్తున్నారు. మహేష్ కృషిని ప్రశంసిస్తూ పరిసర గ్రామాల రైతులకు పరిచయం చేస్తున్నారు. నూతన పరికరం వల్ల సాగు ఖర్చులు తగ్గడంతో పాటు పంట దిగుబడి పెరగనుందని రైతులు చెబుతున్నారు. గతంలో సాగు చేసే సమయంలోనే 10 శాతం పంట కోల్పోయే వారమని ఇప్పుడీ బెడద తప్పిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు

<

Related Posts