YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

మగాడి బాధలు...

మగాడి బాధలు...

మగోడి దినం సందర్భంగా.. ఈరోజు మొగాళ్ళ దినం అందరు ఉదయాన్నే లేచి - తలారా స్నానాలు చేసి - దగ్గరలో వున్న గుడి కి వెళ్లి - ఒక కొబ్బరికాయ కొట్టి - వచ్చే జన్మలో మొగాడి గా పుట్టించకు - అని వేడుకుంటున్నా *మొగవాళ్ళన్దరికి శుభాకాంక్షలు* .. *ఎందుకో... మచ్చుకు కొన్ని*???? .... చెడ్డి, చొక్కా తో బాల్యం అంతా గడిపెయ్యాలి. కొన్ని సార్లు చెడ్డి కుడా వెయ్యరు . దువ్వుకోడానికి పొడవాటి జుట్టు కూడా పెంచుకోనివ్వారు. అంట కత్తెర వేసి ఆముదం పూసి కుర్చోబెడతారు. మొహానికి అడ్డం గా ఓ గడ్డం....మీసం... అది గోరుక్కోడానికి ఓ బ్లేడ్..అది తెగితే పూసుకోడానికి ఓ లోషన్... ఇవన్ని క్షవరాలే.. చదువు.. చదివితే సరిపోదు. మొగాడివి రాంక్ రావాలి ????????అని అరచి గోల చేస్తారు. బయమేసినా... బయపడి చావకూడదు .. మగాడు బయపడేది ఏంటి అంటారు. ఎలకవచ్చినా ... పాము వచ్చినా... బల్లి చచ్చినా.. మనమే తియ్యాలి... వారు తియ్యరు. అరవడం మాత్రమే చేస్తారు. ఉద్యోగాలు చెయ్యల్సింది మనం...???? తిని, కూర్చొని ..... కోయిలమ్మ.... కుంకుమరేఖ... రచ్చబండలు...చూసేది వారు. నోములు, వ్రతాలు వారికి... సరుకులు,సామాన్లు తేవాల్సింది మనం. పెళ్లి చేసుకుంటే.. వాళ్ళని బుట్టలో తెస్తారు. మనల్ని...బుట్టలో వేసుకుంటారు.???? పట్టు చీరలు వుంటాయి. కాని.. పట్టు పాంటులు, పట్టు షర్టు లు వుండవు. ఉన్నా పెట్టరు.???? మనం అమ్మాయిలని చుసినా... వాళ్ళు మనలని చుసినా... పళ్ళురాల కొట్టేది మనలనే. టాంకర్ వస్తే... చచ్చి, చెడి, బనీన్లు చింపుకొని... నీళ్ళు పడితే. ఆ నీళ్ళతో కాళ్ళు కడుగుకుంటారు. ఫలానా వాళ్ళ మొగుడు అని చెప్ప్తారు... కాని... ఫలానా వాడి పెళ్ళాం అని ఎందుకు పిలవరో... కాఫీ ఇస్తే తాగాలి.. లేకపోతే... మంచినీళ్లని కాఫీ లా భావించాలి.. పెట్టిన అన్నం తినాలి.. లేకపోతే పస్తులు వుండాలి... పెద్ద నోట్లు లేని రాజ్యం లో... హోటల్ కి వెళ్లి తినే.. స్తోమత మనకి ఎక్కడిది.. నోరు ఇచ్చాడు.. కాని వాడకూడదు. ఇలాంటి బాధల మధ్య కుడా.. ఓ రోజు మనకంటూ ఇచ్చినందుకు తోటి మొగవాళ్ళకి... నా అభినందనలు.. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అన్నట్టు..మన బాధలు... మనమే పడాలి...

ఈ జన్మకింతే... హ్యాపీ మగవాళ్ళ డే

Related Posts