ఏపీకి సీఎం జగనా?కేసీఆర్ రా?: సీపీఐ రామకృష్ణ
అనంతపురం అక్టోబరు 5
నదుల అనుసంధానంపై కేసీఆర్, ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖాధికారులు మాట్లాడుతున్న తీరు ఇవే అనుమానాలను రేకెత్తిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగనా లేక కేసీఆరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కాకుండా ఏపీకి సీఎంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ర్టానికి ఐదేళ్లు కాదు... పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో మాట్లాడిన బీజేపీ నేతలు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 10 మంది జనం మద్దతున్న నాయకులెవ్వరూ బీజేపీలో చేరడం లేరని, బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన నేతల్నే చేర్చుకుంటున్నారన్నారు.