YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మారని  రిమ్స్ ఆస్పత్రి

మారని  రిమ్స్ ఆస్పత్రి

మారని  రిమ్స్ ఆస్పత్రి
ఒంగోలు, 
ప్రకాశం  మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప కూడా దాటడం లేదు. ఓవైపు ఆస్పత్రుల పారిశుధ్య అధ్వాన్నస్థితి మారాలని అమాత్యులు గట్టిగా చెబుతుంటే.. మరోవైపు అధికారులు, సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మనుషులు ఉండటానికి కూడా వీలులేని దుర్బర స్థితిలో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి ఉందని సాక్ష్యాత్తూ ఆరోగ్య శాఖ మంత్రి అన్నారంటే పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్క రిమ్స్ ఆస్పత్రిలోనే కాదు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల తీరు ఇలానే ఉంది. ఆస్పత్రుల్లో పారిశుధ్య చర్యలు పడకేశాయి. ముక్కుపుటలు ఆదిరేలా దుర్గంధం వెదజల్లుతున్నాయి.పారిశుధ్యం, పరిశుభ్రత అంటూ ఆరోగ్య సూత్రాలు వల్లె వేసే వైద్యులు, వైద్యాధికారులు.. చెప్పేందుకే నీతులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని వైద్యాలయాలు చెత్తకుండీలను తలపిస్తున్నాయి. ఏ వార్డులోకి వెళ్లినా భరించలేని దుర్గంధం వెదజల్లుతున్నాయి. చెత్తా చెదారంతో రోగులకు స్వాగతం పలుకుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్దతిలో పారిశుధ్యచర్యలు నిర్వహిస్తున్నారు. డాక్టర్లు, వైద్యాధికారుల కార్యాలయాలు, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచి.. మిగతా వార్డులను శుభ్రపరచడంలో అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఉన్నతాధికారులకు నజరానాలు ముట్టజెప్పడం వల్లే వారు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.ఇక ఇన్ పేషెంట్‌ వార్డుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చినిగిన బెడ్లు, రక్తపు మరకలు, వాడిపాడేసిన గ్లూకోస్‌, రక్తం బాటిల్స్‌తో చెత్తకుండిని తలపిస్తున్నాయి. ఆస్పత్రుల్లోని అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి రోగులు, రోగుల బంధువులు ముక్కున వేలేసుకుంటున్నారు.ఇక చిల్డ్రన్స్‌ వార్డుల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అపరిశుభ్ర పరిసరాల వల్ల చిన్నారులకు త్వరగా ఇన్‌ఫెక్షన్స్ సోకుతాయని వైద్యులకు తెలియంది కాదని..అయినా ఇవేవీ పట్టనట్లుగా విధులు నిర్వహిస్తున్నారని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. పేదోడికి పెద్దాస్పత్రులంటే కొండంత అండ అన్న పరిస్థితులు మారాయని..వచ్చిన రోగం తగ్గక పోగా కొత్త రోగాలు అంటుకోవడం ఖాయమని మండిపడుతున్నారు. 

Related Posts