YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

చిన్నమ్మకు చిక్కులేనా

చిన్నమ్మకు చిక్కులేనా

చిన్నమ్మకు చిక్కులేనా
బెంగళూర్, 
జయలలితకు అత్యంత ఆప్తురాలు శశికళ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఏమాత్రం కన్పించడం లేదు. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. శశికళ సత్ప్రవర్తన కారణంగా ఈ ఏడాది చివరకు జైలు నుంచి విడుదలవుతారని భావిస్తున్నారు. పూర్తి శిక్షాకాలం మరో ఏడాది ఉన్నప్పటికీ శశికళ ను ఈ ఏడాది చివరకు విడుదల చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.శశికళ రాకకోసం ఇటు దినకరన్ పార్టీకి చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలతో పాటు అన్నాడీఎంకేలో సీనియర్ నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. 2021 ఎన్నికల నాటికి శశికళ తిరిగి పాత ఇమేజ్ ను పొందగలదదని భావిస్తున్నారు. అక్రమంగా జైలులో ఉంచారని ఇప్పటికే శశికళపై సానుభూతి పవనాలు వీస్తున్నాయని దీనకరన్ వర్గీయులు చెబుతున్నారు. స్టాలిన్, పళనిస్వామి నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించడం లేదని చెబుతున్నారు.శశికళను బయటకు తీసుకువద్దామనుకున్నప్పుడల్లా ఏదో ఒక అవాంతరాలు ఎదురవుతున్నాయి. గతంలో ఆమె భర్త నటరాజన్ కు ఆరోగ్యం బాగాలేకపోవడంతో చిన్నమ్మ పెరోల్ పై బయటకు వచ్చారు. పెరోల్ పై బయటకు వచ్చిన చిన్నమ్మ పొలిటికల్ చర్చలు జరిపారన్న వార్తలు బయటకు పొక్కడంతో ఆమె పెరోల్ ను న్యాయస్థానం అప్పట్లో రద్దు చేసింది. ఇక తాజాగా దినకరన్ వర్గీయులు ఈ ఏడాది డిసెంబరు నాటికి చిన్నమ్మను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈసారి కూడా చిన్నమ్మపై ఆరోపణలు వచ్చాయి. శశికళను సత్ప్రవర్తన మీద బయటకు తీసుకురావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శశికళకు పరప్పణ అగ్రహార జైలులో అన్ని సౌకర్యాలు సమకూరుతున్నట్లు ఆర్టీఐ ద్వారా బయట పెట్టారు. లగ్జరీ సేవలు చిన్నమ్మ పొందుతున్నారని, ఆమెను రోజుకు ఏడుమంది వరకూ జైలులో కలుస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపెట్టారు. దీంతోచిన్నమ్మ సత్ప్రవర్తనపైన బయటకు వచ్చే అవకాశాలు సన్నగిల్లాయని చెబుతున్నారు. దినకరన్ పార్టీ నేతలు మాత్రం శశికళ బయటకు రాకుండా కొందరు చేస్తున్న కుట్రలో భాగమే ఈ ఆరోపణలని కొట్టిపారేస్తున్నారు. మొత్తం మీద శశికళ ఈ ఏడాది చివరకు బయటకు రావడంతో కొంత అనుమానంగానే కన్పిస్తుంది. 
వెనక్కి తగ్గుతున్న దినకరన్
మ్మ మక్కల్ మున్నేట్ర కళగం అధినేత, శశికళ మేనల్లుడు దినకరన్ వెనక్కు తగ్గారు. ఎన్నికల్లో వరస విజయాలతో ఆయన ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక తర్వాత తమిళనాడు జరిగిన ప్రతి ఎన్నికల్లో దినకరన్ పార్టీ పోటీ చేసింది. చతికల పడింది. కనీస ప్రభావాన్ని కూడా చూపలేకపోయింది. పార్టీ పెట్టిన తర్వాత ఒక్క విజయమూ దక్కకపోవడంతో దినకరన్ నాయకత్వంపై విశ్వాసం చల్లగిల్లింది.అన్నాడీఎంకే నుంచి బహిష్కరించిన తర్వాత టీటీవీ దినకరన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈ విజయం తెచ్చిన ఊపుతో దినకరన్ మేనత్త శశికళ సూచన, సలహాల మేరకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని స్థాపించారు. అన్నాడీఎంకే లో ఉన్న అసంతృప్త నేతలందరూ దినకరన్ పార్టీలో చేరిపోయారు. దీంతో రోజురోజుకూ దినకరన్ బలం పెరుగుతుందని అందరూ భావించారు. ఒకదశలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే సయితం కొంత కంగారు పడింది.కానీ వరసగా జరిగిన ఉప ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో దినకరన్ పార్టీ సొంతంగా బరిలోకి దిగింది. ఎవరితో పొత్తుకు దినకరన్ ఇష్టపడలేదు. అయితే శాసనసభ ఉప ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో దినకరన్ పార్టీ చతికల పడింది. దీంతో ఆయన ప్రస్తుతం జరుగుతున్న రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సరైన కారణాలు చెప్పకపోయినా తమ లక్ష్యం 2021 సాధారణ ఎన్నికలేనంటున్నారు.అయితే దినకరన్ పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ప్రధాన కారణం గుర్తు అంటున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ కు ప్రెషర్ కుక్కర్ గుర్తు వచ్చింది. అదే గుర్తు తమ పార్టీకి ఇవ్వాలని కోరినా ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. అంతేకాకుండా తమ పార్టీకిచెందిన అభ్యర్థులందరికీ ఒకే గుర్తు కేటాయంచాలని కోరినా ఈసీ అంగీకరించలేదు. దీంతో తమ అపజయాలకు కారణం గుర్తేనంటున్నారు దినకరన్. అందుకే ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని దినకరన్ చెబుతున్నారు.

Related Posts