YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

యడ్డీని నిద్రపోనివ్వడం లేదే....

యడ్డీని నిద్రపోనివ్వడం లేదే....

యడ్డీని నిద్రపోనివ్వడం లేదే....
బెంగళూర్, 
కర్ణాటక బీజేపీలో ఇబ్బంది కరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా బీజేపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన యడ్యూరప్పకు ఇంట శత్రువుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. యడ్యూరప్పకు నిబంధనలను పక్కన పెట్టి బీజేపీ కేంద్ర నాయకత్వం ముఖ్యమంత్రిని చేసింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావడం బీజేపీలోని ఒక వర్గం ఇష్టం లేదు.ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన తర్వాత యడ్యూరప్ప బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీీ అధిష్టానం నళిన్ కుమార్ కటీల్ ను కేంద్ర నాయకత్వం నియమించింది. నళిన్ కుమార్ కటీల్ ఆర్ఎస్ఎస్ పునాదుల నుంచి వచ్చిన వ్యక్తి. యడ్యూరప్పకు చెక్ పెట్టడానికే నియమించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే నళిన్ కుమార్ కటీల్ తాను అందరి సహకారంతో పార్టీని ముందుకు తీసుకెళతానని ప్రకటించారు. దీనికి తోడు నళిన్ కుమార్ కటీల్ కు బీజేపీీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సంతోష్ తోడయ్యారు. ఇద్దరు కలసి పార్టీ విషయాల్లో యడ్యూరప్పను పక్కన పెట్టారన్నది వాస్తవం. యడ్యూరప్ప కు కనీస సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల విషయంలో బీజేపీకి చెందిన మంత్రులు మాట జారడానికి కూడా వీరిద్దరే కారణమని యడ్యూరప్ప నమ్ముతున్నారు. మేయర్ ఎంపిక విషయంలో కూడా జోక్యం చేసుకోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు.మరోవైపు ఉప ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకే తిరిగి టిక్కెట్లు అని యడ్యూరప్ప ప్రకటించిన తర్వాత నళిన్ కుమార్ కటిల్ తో ఆ నియోజకవర్గ బీజేపీ నేతలు, ఆశావహులు తరచూ భేటీ అవుతుండటం కూడా యడ్యూరప్పకు ఆగ్రహం కల్గిస్తోంది. అయితే నళిన్ కుమార్ కటీల్ మాత్రం వారి అసంతృప్తిని తొలగించేందుకే తాను ప్రయత్నిస్తున్నానని చెబుతున్నారు. ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేతల మధ్య విభేదాలు కొంప ముంచేలా ఉన్నాయి.

Related Posts