YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రామ్ మాధవ్ కే... అవకాశాలు

రామ్ మాధవ్ కే... అవకాశాలు

రామ్ మాధవ్ కే... అవకాశాలు
న్యూఢిల్లీ, 
భారతీయ జనతా పార్టీ ఒకపుడు బ్రాహ్మిణ్, , బనియా పార్టీగా ముద్ర పడింది. అంటే బీజేపీ సిధ్ధాంతాలు ఎక్కువగా అగ్రవర్ణాల వారికే నచ్చేలా ఉండేవి. హిందూ మతం, భారతీయత, సంప్రదాయలు ఇవి ఎక్కువగా ఆచరించే సామాజికవర్గాలు బీజేపీని ఇష్టపడేవి అంటారు. దాంతో బీజేపీకి కొద్ది ఓట్లు, కొంత మేర రాజకీయ వాతా మాత్రమే ఏపీ లాంటి చోట లభించేది. ఇక తరువాత కాలంలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు చేరినా వారు సైతం హిందూ కార్డ్, దేశభక్తి పట్ల విశ్వాసం కలిగి బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. ఎపుడైతే వెంకయ్యనాయుడు లాంటి వారు బీజేపీ జెండా మోశారో ఆ తరువాత కధ కొంత మారింది. తెలుగుదేశం ఏర్పడ్డాక బలమైన కమ్మ సామాజికవర్గానికి రాజకీయంగా ప్రాధ్యాన్యత బాగా పెరిగి అధికారంలోకి వచ్చింది. దాంతో టీడీపీకి పోటీగా బీజేపీ సైతం అదే సామాజికవర్గాన్ని పెంచి పోషించలసివచ్చింది. మరో వైపు టీడీపీకి మిత్రపక్షంగా బీజేపీ మెలగడంతో ఆ వర్గం ఆధిపత్యం బీజేపీలోనూ బాగానే కనిపించింది.బీజేపీ అంటే వెంకయ్యనాయుడు అన్న ముద్ర నుంచి ఏపీలో మెల్లగా బయట పడుతున్న వేళ బ్రాహ్మణులు కూడా ఆ పార్టీలో పూర్వపు వైభవాన్ని కోరుకుంటున్నారు. దానికి తగినట్లుగా బీజేపీ సైతం వారిని సమాదరిస్తోంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ నరసింహారావుకు రాజ్యసభ మెంబర్ ఇవ్వడమే కాకుండా ఏపీ రాజకీయాల్లో ఆయన్ని క్రియాశీలం చేసిన బీజేపీ ఇపుడు ఏపీకే చెందిన మరో వరిష్ట బ్రాహ్మణ నాయకుడు వారణాసి రాం మాధవ్ ని ఏకంగా కేంద్రమంత్రిగా చేయాలనుకుంటోంది. రామ్ మాధవ్ జాతీయ రాజకీయాల్లో చాలాకాలంగా ఉంటూ వస్తున్నారు. ఆయన కాశ్మీర్లో పీడీఎఫ్, బీజేపీ ల మధ్య పొత్తు కుదిర్చి సర్కార్ ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరడానికి తనవంతుగా పాత్ర పోషించారు. ప్రత్యేకించి మోడీ అమిత్ షాలకు బహు ఇష్టుడు. రెండవసారి బీజేపీ అధికారంలోకి వచ్చినపుడే రామ్ మాధవ్ పేరు కేంద్ర మంత్రి పదవికి వినిపించింది. నాలుగు నెలల తరువాత అది సాకారం అయ్యేలా కనిపిస్తోంది.రెండు తెలుగు రాష్ట్రాలో చూసుకుంటే ఏపీ నుంచి కేంద్రంలో మంత్రి పదవికి ప్రాతినిధ్యమే లేదు. మొత్తానికి మొత్తం లోక్ సభ సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఆ పార్టీ బీజేపీ ప్రభుత్వంలో చేరలేదు. ఇక బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో తొలి దఫాలో ఏపీ నుంచి ఎవరినీ మంత్రిగా తీసుకోలేదు. ఇపుడు మాత్రం విస్తరణలో ఏపీకి చాన్స్ లభించేలా ఉంది. రామ్ మాధవ్ ని కేంద్ర మంత్రిని చేస్తారని అంటున్నారు. రామ్ మాధవ్ సేవలను పార్టీ ఉపయోగించుకోవడమే కాకుండా ప్రభుత్వంలోనూ ఆయనకు సముచిత స్థానం ఇవ్వడం ద్వారా ఏపీలో బీజేపీని విస్తరింపచేయాలని కమలనాధుల వ్యూహంగా ఉంది. రామ్ మాధవ్ కి కనుక కేంద్ర మంత్రి పదవి దక్కితే ఏపీ బీజేపీలో బలమైన కమ్మ సామాజికవర్గం ఆధిపత్యానికి కొంతవరకూ బ్రేకులు పడినట్లేనని అంటున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ పదవిని కాపులకు ఇచ్చారు. ఇపుడు కేంద్ర మంత్రిగా బ్రాహ్మణునికి ఇస్తే ఏపీలో కొత్త సామాజిక సమీకరణలకు బీజేపీ తెరతెసినట్లవుతుంది. చూడాలి మరి.

Related Posts