YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఆర్టీసీ సమ్మె: గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

ఆర్టీసీ సమ్మె: గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

ఆర్టీసీ సమ్మె: గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ 
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం నివాళులర్పించేందుకు ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో గన్ పార్క్ కు తరలిరావడంతో ర్టీసీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసారు.  గన్ పార్క్ వద్ద ధర్నా, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. అందోళనకారులు మాత్రం  మాత్రం తాము గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివారులర్పించడానికి వచ్చామని, దీనికి అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. జేఏసీ నాయకులను అరెస్ట్‌ చేయడాన్ని ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్‌ థామస్‌రెడ్డి ఖండించారు. అరెస్ట్‌ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అరెస్టులు ఆపకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్రమ అరెస్టులను ప్రభుత్వం ఆపాలన్నారు. అరెస్టులకు నిరసనగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మరోవైపు, ఈ రోజు తలపెట్టిన ఆర్టీసీ జేఏసీ నిరాహార దీక్షను వాయిదా వేశారు.  పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్టీసీ జేఏసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  మరోవైపు సీఎం కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన మొదలైంది.  ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిపో అధికారులు తాత్కాలిక నియామకాలు చేపడుతున్నారు. 

Related Posts