పాకిస్థాన్ తీరును తప్పుపట్టిన ఎఫ్ఏటీఎఫ్
న్యూ ఢిల్లీ
ఆసియా పసిఫిక్ గ్రూప్‌లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) పాకిస్థాన్ తీరును తప్పుపట్టింది. ఉగ్రవాద నిర్మూలన కోసం ఆ దేశం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది. ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలిలోని 1267 నియమావళిని పాకిస్థాన్ సంపూర్ణంగా అమలు చేయలేదని ఎఫ్ఏటీఎఫ్ పేర్కొన్నది. ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో పాటు లష్కరే, జమాతుల్ దవా, ఎఫ్ఐఎఫ్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులను అడ్డుకోవడంలో పాక్ విఫలమైనట్లు ఆసియా పసిఫిక్ గ్రూపు సంస్థ పేర్కొన్నది. ఉగ్రసంస్థలతో జరుగుతున్న మనీ ల్యాండరింగ్‌ని పాకిస్థాన్ గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎఫ్ఏటిఎఫ్ తెలిపింది. పాక్ నేలపై కొనసాగుతున్న ఉగ్ర కార్యకలాపాలు, దాని వల్ల జరిగే నష్టం గురించి ఆ దేశం ఆలోచించాలని ఆ సంస్థ పేర్కొన్నది.