YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఇంజినీరింగ్ ఏర్పాట్లు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఇంజినీరింగ్ ఏర్పాట్లు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఇంజినీరింగ్ ఏర్పాట్లు :
తిరుమల, 
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా  మరింత సౌకర్యావంతంగా స్వామివారి వాహనసేవాలు వీక్షించేలా రూ. 7.55 కోట్లతో ఇంజినీరింగ్ ఏర్పాట్లు చేపట్టామని టిటిడి చీఫ్ ఇంజినీర్ రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్లో సోమవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  రామచంద్రారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రూ. 3.46 కోట్లతో ఆలయ నాలుగు మాడ వీధులలో గ్యాలరీలలోని మరుగుదొడ్లకు నీటి కుళాయిల ద్వారా నిరంతరము నీటి  సరఫారాకు చర్యలు తీసుకున్నామన్నారు. శ్రీవారి పుష్కరిణిలో 10 మిలియన్ లీటర్ల పరిశుభ్రమైన నీటిని నింపి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేసినట్టు తెలిపారు. వాహనసేవలు తిలకించేందుకు వచ్చిన భక్తులకు సౌకర్యవంతంగా గ్యాలరీలు, బారీకేడ్లు, నాలుగు మాడ వీధుల్లో భజనమండపాలను ఏర్పాటుచేశామన్నారు. శ్రీవారి ఆలయం, మాడ వీధుల్లో పెయింటింగ్, రంగోళిలు, ప్రదర్శనశాల కోసం ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు.  తిరుమలలో 8100 నాలుగు చక్రాల వాహనాలు, తిరుపతిలో గరుడసేవనాడు అలిపిరి, శ్రీవారి మెట్టు వద్ద 4,700 ద్విచక్ర వాహనాలు, 230 నాలుగు చక్రాల వాహనాల కోసం తాత్కాలిక పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలలో రోజుకు 35 లక్షల గ్యాలన్ల నీటి సరఫరా, ప్రత్యేకంగా గరుడసేవ నాడు 43 లక్షల గ్యాలన్ల నీటిని నిరంతరాయంగా సరఫరా చేసినట్లు వివరించారు. నూతన శ్రీవారి సేవాసదన్, తిరువేంకటపథం రింగ్ రోడ్డు వద్ద అదనంగా పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టామన్నారు. 
ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో రూ. 3.29 కోట్లతో ఏర్పాట్లు -
 తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో 41 ఎల్ఇడి విద్యుద్దీపాల కటౌట్లను ఆకట్టుకునేలా ఏర్పాటుచేశామని సిఈ తెలిపారు. తిరుమల, తిరుపతిలలో విద్యుత్ను ఆదా చేసేందుకు ఎల్ఇడి దీపాలు, స్ట్రిప్స్ను ఏర్పాటుచేశామన్నారు. బ్రహ్మోత్సవ మహాప్రదర్శన వద్ద ప్రత్యేక లైటింగ్ను తీర్చిదిద్దామన్నారు.         అదేవిధంగా రేడియో అండ్ బ్రాడ్కాస్టింగ్ విభాగాము ద్వారా రూ.80 లక్షలతో ఆలయ నాలుగు మాడ వీధుల్లో, ఇతర ప్రాంతాల్లో  కలిపి మొత్తం 33 డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటుచేశామన్నారు.

Related Posts