మత వివక్ష లేదంటూనే ఒక మతాన్ని ఒకరకం గాను, మరో మతాన్ని మరో రకంగాను చూసేందుకు కేంద్ర, ఆయా రాష్ట్రాలు వివక్షను పాటిస్తున్నాయి. ముస్లింలను బుజ్జగించేందుకే హజ్‌యాత్రకు ప్రభుత్వం సాయంచేస్తోందనే ఆరోపణలను తరచుగా బీజేపీ నేతలు చేస్తున్న నేపథ్యంలో హజ్‌యాత్రకు అందించే సబ్సిడీని రద్దుచేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. మరోైవెపు మరికొన్ని మతాలకు (ముఖ్యంగా హిందువులకు) పండుగలకు, తీర్థయాత్రలకు సాయాన్ని మాత్రం రద్దుచేయులేదు. సబ్సిడీని రద్దుచేసినప్పటికీ ఈ ఏడు 1.75 లక్షల మంది ముస్లింలు హజ్‌యాత్ర కు వెళ్తున్నారని కేంద్ర వైునారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రకటించారు. భారత్ నుంచి నౌకల ద్వారా హజ్ యాత్రను సౌదీ అరేబియా ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని, ఈ అంశంపై త్వరలో చర్చలు జరపనున్నామని ఆయన చెప్పారు.
కుంభ్ మేళాకు, ఇతర పండుగలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దమొత్తంలో నిధులు ఖర్చుచేయడం గమనార్హం. వివిధ హిందూ పండగలకు, తీర్థయాత్రలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుచేస్తున్న ప్రజాధనానికి ప్రజల పరిశీలన నుంచి ప్రభుత్వాలు తప్పించుకున్నాయి. అలహాబాద్‌లో కుంభమేళా కోసం 2014లో 1500 కోట్లు కేంద్రం ఖర్చుచేయగా మహారాష్ట్ర 2500 కోట్లు కేటాయించింది. సింహాస్థ మహాకుంభ్ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది.
ఎలాంటి బుజ్జగింపులతో సంబంధం లేకుండా వైునారిటీలు మరింత గౌరవంగా స్వయంప్రతిపత్తితో జీవించేందుకు వీలుగా సబ్సిడీ రద్దుపై తీసుకు న్న విధాన నిర్ణయమని ఆయన వివరించారు. ఆరేళ్ల క్రితం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హజ్‌యాత్ర సబ్సిడీని రద్దుచేయాలని సుప్రీంకోర్టు రా జ్యాంగ బెంచ్ ఆదేశాలను తాము అమలుచేశామని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులపై ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫార్సుల మేరకు హజ్ యాత్రకు సబ్సిడీలను నెమ్మదినెమ్మదిగా రద్దుచేయాలని ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించిందని ఆయన అన్నారు. హజ్‌యాత్ర సబ్సిడీల్లో ఎక్కువ భాగం విమానయాన సంస్థ భరిస్తోంది.
హజ్ యాత్ర సబ్సిడీల్లో ఎన్నో అంశాలున్నాయని, సబ్సిడీలనేవి కేవలం కంటితుడుపు చర్యలు మాత్రవేునని చాలామంది భావిస్తారు. ఈ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీలో భాగంగా తిరుగు టికెట్‌ను 45 వేల రూపాయులకు ఇస్తారని, కానీ ఎంతో ముందుగా రిజర్వ్ చేసుకోవడం కారణంగా యాత్రికులకు అధిక శ్రమ తప్పడం లేదని ఒక ఆంగ్లపత్రిక ఉటంకించింది. న్యూఢిల్లీ నుంచి జె డ్డాకు టికెట్ వెల 30వేల రూపాయలు మాత్రమే ఉందని, ఇక హజ్ యాత్రికులకు లభించే సబ్సిడీ ఏముంది? విమానాల్లో వెళ్లే వారికి సబ్సిడీ ఇస్తున్నామని ప్రకటించడంలో అర్ధవేుమిటనేది ప్రశ్న.
2016-17లో హజ్ యాత్రకు కేంద్రం 450 కోట్ల రూపాయలు కేటాయించింది. పదేళ్లలో దశల వారీగా సబ్సిడీలు రద్దుచేయాలని సుప్రీంకోర్టు ప్రకటించిన 2012 నుంచి సబ్సిడీ మొత్తం తగ్గుతూ వస్తోంది. వాస్తవానికి సబ్సిడీని రద్దుచేయాలని అఖిల భారత ముస్లిం-ఏ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ నాయుకుడు అసదుద్దీన్ ఒవైసీ ఎప్పటినుంచో డిమాండు చేస్తున్నారు. విమానయాన సంస్థలను కొనసాగించడానికే ఈ సబ్సిడీలు ఉపయోగపడతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అదే మతానికి చెందిన ఆడపిల్లల చదువులు కోసం మరిన్ని పాఠశాలలను, హాస్టళ్ల ఏర్పాటు, ఇతర సామాజిక కార్యక్రమాలకు ఉపయోగించాలని ఈ సబ్సిడీ మొత్తాన్ని ఖర్చు చేయాలని ఆయున సూచించారు.
యాత్రికులను తరలించేందుకు ఎన్నో విమానాలను ఏర్పాటు చేయువలసి ఉన్నందున టికెట్ రేట్లు పెంపుదల అనివార్యవుని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా టికెట్ రేట్లను సవుర్థించుకుంటోంది. ఇలా హజ్‌యాత్రికులను తరలించిన తరవాత ఆ విమానాలు తిరుగు ప్రయాణంలో ఖాళీగా రావలసి వస్తోందని ఎయిర్ ఇండియా అధికారులు వాదిస్తున్నారు. హజ్ యాత్ర ప్రారంభంలోను, ముగింపు సమయంలోనూ ఇదే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారంటున్నారు. హజ్ యాత్రికులను తరలించడంలో ఎయిర్ ఇండియా గుత్తాధిపత్యాన్ని నిరోధిస్తే సమస్య పరిష్కారం కాగలదని ఒవైసీ తదితర ముస్లిం మేధావులు అభిప్రాయుపడుతున్నారు. ‘హజ్ యాత్రల కోసం తక్కువ రేట్లకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తే మరింత మంది యాత్రికులు హజ్ యాత్ర చేసే అవకాశాలుంటా’యని ఒవైసీ చెబుతున్నారు. ఇదే సవుయంలో కుంభ్ మేళాకు, ఇతర పండుగలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దమొత్తంలో నిధులు ఖర్చుచేయుడం గమనార్హం. వివిధ హిందుపండగలకు, తీర్థయాత్రలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుచేస్తున్న ప్రజాధనానికి ప్రజల పరిశీలన నుంచి ప్రభుత్వాలు తప్పిం చుకున్నాయి.
కుంభ్ మేళా కోసం హరిద్వార్, నాశిక్, అలహాబాద్, ఉజ్జయిన్‌ల్లో పెద్దమొత్తంలో కేంద్రం ఖర్చుచేస్తోంది. దీనికి కోట్లాది మంది హాజరవుతారు. అలహాబాద్‌లో కుంభమేళా కోసం 2014లో 1500 కోట్ల రూపాయులు కేంద్రం ఖర్చుచేసింది. మహారాష్ట్ర ప్రభుత్వైమెతే ఇందుకోసం 2500 కోట్ల రూపాయలు కేటాయించింది. హజ్ యాత్రికులు క్షేమంగా తమ యాత్ర పూర్తిచేసుకు వచ్చేలా కేంద్రం అనేక సహాయ కార్యక్రమాలను చేపడుతున్న విషయం వాస్తవమే. ఇందుకు ఒక్క భారత్‌లోనే కాకుండా సౌదీ అరేబియాలో కూడా పెద్దయెుత్తున ఖర్చు పెడుతున్నది. ఈ మొత్తం సబ్సిడీలో భాగంగా పరిగణించడం లేదు. సింహాస్థ మహాకుంభ్ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయలను కేంద్రం కేటాయిం చింది. 12 ఏళ్లకోసారి (పుష్కరం) ఉజ్జయిన్‌లో ఈ కుంభ్‌మేళ జరుగుతుంటుంది. 2016లో ఈ కుంభ్‌వేుళ కోసం శివరాజ్ చౌహాన్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 4500 కోట్లు ఖర్చుచేసింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని 5000 కోట్లకు పెంచాలని నిశ్చయించింది. హిమాలయాల ద్వారా టిబెట్‌లోకి సాగే కైలాస మానస సరోవర యాత్రకు కేంద్రం చెప్పుకోదగిన మొత్తాన్ని ఖర్చుచేస్తోంది.కైలాస మానస సరోవర్ యాత్రం కోసం టిబెట్, చైనా వెళ్లే యాత్రికులకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం 50 వేల రూపాయులను మంజూరుచేసింది.
ప్రస్తుత ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచింది. జమ్ము కశ్మీర్‌లోని లడఖ్‌కు సింధు దర్శన్ యాత్రకు రాష్ట్రం నుంచి వెళ్లే యాత్రికులొక్కక్కరికీ 10 వేల రూపాయుల సబ్సిడీ ఇవ్వాలని ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయిం చింది. ఆయా రాష్ట్రాల నుంచి కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లే వారికి చత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా ఇతోధికంగా ఆర్థికసాయాన్ని అందిస్తున్నాయి. అంతేగాకుండా, అమర్‌నాథ్ యాత్ర, గణేశ్ ఉత్సవాల్లో నీటిసీసాలను శుభ్రం చేయుడానికి కేంద్రం, రాష్ట్రాలు ఎంతో ఖర్చు చేస్తున్నాయి. ఈ సహాయాలను కూడా న్యాయుస్థానాలుగానీ, ప్రభుత్వాలుగానీ రద్దుచేస్తాయా? ఇవేకాకుండా స్థానిక పండుగలకు రాష్ట్రప్రభుత్వాలు పెద్దఎత్తున ఖర్చుచేస్తున్నాయి. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం కృష్ణ, గోదావరి పుష్కరాలకు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం కన్వర్‌యాత్రకు, హర్యానా ప్రభుత్వం గీతా ఫెస్టివల్‌కు పెద్దమొత్తంలో ఖర్చుచేస్తున్నాయి. దీనికి తోడు దేవాలయాల జీర్ణోద్ధరణకు, వివిధ దేవతలు, దేవుళ్ల విగ్రహావిష్కరణలకు, వరుణుడి కరుణ కోసం యజ్ఞయాగాల నిర్వహణ, కొన్ని దేవాలయాలోని పూజారులకు, అధికారులకు జీతాల చెల్లింపు లకు కూడా ప్రభుత్వాలు పెద్దమొత్తాలను కేటాయిస్తున్నాయి. ఇన్ని ఖర్చులు చేస్తుండగా హజ్ యాత్రకు ఖర్చుచేసినంత మాత్రాన ప్రభుత్వ ఖజానా ఏమీ తరగిపోదు.