YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట్ట

 శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట్ట

 శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట్ట
దాదాపు 6.02 లక్షల మందికి సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం 
తిరుమల 
 శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 7 రోజుల్లో దాదాపు 6.02 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించినట్లు శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో  హరీంద్రనాధ్ తెలిపారు.          రాంభగీచా 2లోని మీడియా సెంటర్లో సోమవారంనాడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో విఐపి దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 తగ్గించి సామాన్య  భక్తులకు పెద్దపీట వేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు నిర్వహణ, తక్కువ వ్యవధిలో సంతృప్తికర దర్శనం కల్పించినట్లు వివరించారు. స్వామివారి వాహన సేవలు వీక్షించిన భక్తులందరికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు తెలిపారు. శ్రీవారి కైంకర్యాల సమయంలో తప్ప మిగిలిన సమయం అంతా శ్రీవారిని దర్శించుకున్నట్లు వివరించారు. భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాలు అధికంగా పంపిణీ చేసినట్లు తెలియజేశారు. 
శ్రీవారి హుండి ద్వారా ఈ ఏడాది 7 రోజులకు రూ. 17.97 కోట్లు లభించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యార్ధం ముందస్తుగా  8.5  లక్షల లడ్డూలు సిద్ధంగా వుంచినట్లు వివరించారు. శ్రీవారి భక్తులకు ఇప్పటి వరకు 30.15 లక్షల లడ్డూలు అందించినట్లు తెలియజేశారు. ప్రతి రోజు శ్రీవారి వాహన సేవల్లో ప్రత్యేకంగా అలంకరణలు చేశామన్నారు. 

Related Posts