తెలంగాణ ఉద్యమం లో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమైనది
ఆర్టీసీ కార్మికులకు బిజెపి అండగా ఉంటుంది
సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులదే ప్రధాన పాత్ర
తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్
నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చా లని గత మూడు రోజులుగా చేస్తున్న సమ్మె లో భాగంగా షాద్ నగర్ బస్టాండ్ లో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది.షాద్ నగర్ భాజపా నాయకులు పాల్గొని వారికి సంగీభావం తెలపడం జరిగింది.తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయం లో ఆర్టీసీ కార్మికుల పాత్ర చాలా కీలకమైనది అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయం లో బంద్ కాల్ ఇస్తే ముందుగా సంపూర్ణాంగా బంధు పెట్టేది ఆర్టీసీ కార్మికులే అని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని అన్నారు .తెలంగాణ కార్మికుల పాదాల లో ముల్లు కుచ్చుకుంటే తన పంటి తో తీస్తా అన్న కేసీఆర్ కార్మికులపై ఇప్పుడు ఎందుకు కర్కశం కక్కుతున్నారని అన్నారు.ఓట్లప్పుడు ఒక మాట సీటు ఎక్కినాక ఒకమాట కేసీఆర్ నైజం అని పేర్కొన్నారు .పక్క రాష్ర్ర ముఖ్యమంత్రి ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తే నువ్వు మాత్రం ప్రవేటికరణ చేయడానికి పావులు కాదుపుతున్నావు ముఖ్యమంత్రి నీకు సోయి లేదా అని అన్నారు.విధుల్లో చేరకపోతే ఉద్యోగం లోనుండి తొలగిస్తాం అని అంటే ని బెదిరింపులకు ఎవ్వరు బయపడరని అన్నారు .మీకు ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతాపార్టీ అండగా ఉంటుందని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు,జాతీయ నాయకత్వం దృష్టికి మీ సమస్యలను తీసుకెల్లారని పేర్కొన్నారు .తెలంగాణ ప్రజలు కూడ ఆర్టీసీ కార్మికుల బాధలను గమనించి ప్రజలు సహకరిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అసెంబ్లీ కన్వీనర్ దేపల్లి అశోక్ గౌడ్,సీనియర్ నాయకులు నందిగామ వెంకటేష్ ,యువమోర్చ నాయకులు వంశీకృష్ణ, మధుసూదన్ గౌడ్ ,ఋషికేశ్ తదితరులు పాల్గొన్నారు.
==