YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కలుసుకున్న రేవంత్ రెడ్డి 

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కలుసుకున్న రేవంత్ రెడ్డి 

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కలుసుకున్న రేవంత్ రెడ్డి 
హైదరాబాద్,

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి . టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌‌ను  చంచల్ గూడ జైల్లో  పరామర్శించి, ఆయనకు సంఘీభావం తెలిపారు. రవిప్రకాశ్‌పై ప్రభుత్వం కక్షపూరితంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఆయనపై తప్పుడు కేసులు పెట్టి, అక్రమంగా అరెస్టు చేశారని రేవంత్ ఆరోపించారు. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కంపెనీ నిధులను అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలపై శనివారం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని, అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో రవిప్రకాశ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

Related Posts