YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

48 వేల ఉద్యోగులపై వేటు

48 వేల ఉద్యోగులపై వేటు

48 వేల ఉద్యోగులపై వేటు
హైద్రాబాద్, 
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ కన్నెర్రజేశారు. చట్టానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగిన ఆర్టీసీ జేఏసీతో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక ఆర్టీసీలో మిగిలింది 1200 మంది మాత్రమే.. కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఆర్టీసీలో 49 వేల మందికిపైగా పని చేస్తుండగా.. కేసీఆర్ నిర్ణయంతో 48 వేల మందికిపైగా ఉద్యోగాలను కోల్పోయినట్టే. ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులను ఇంటికి పంపించడం అనేది అసాధారణ నిర్ణయం.ప్రయివేట్ బస్సులను స్టేజీ క్యారియర్లుగా మార్చాలని.. 15 రోజుల్లో సాధారణ పరిస్థితి నెలకొనాలని అత్యున్నత స్థాయి సమావేశంలో అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఉద్యోగులను డిస్మిస్ చేస్తామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి.అర్థంలేని సమ్మెలతో ప్రజానీకానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఎంతో మంది యువత ఉద్యోగాల కై అల్లాడిపోతున్నారు వారిని ని 28 ఏళ్ల సర్వీసు పూర్తి అయిన వాళ్ళని శాశ్వతంగా ఇంటికి ఆర్టీసీ కార్మికులను భయపెట్టడం కోసం కేసీఆర్ ఈ ప్రకటన చేశారా? లేదంటే నిజంగానే వారిని డిస్మిస్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇంత పెద్ద సంఖ్యలో కార్మికులను విధుల నుంచి తొలగించడం వల్లే కేసీఆర్ ఆశించిన ప్రయోజనాలు నెరవేరతాయని చెప్పలేం. ఇది ప్రజాగ్రహానికి దారి తీసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. పొరుగున ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాంటప్పుడు ఇక్కడ చేయడానికి మీకేంటి బాధని ఆర్టీసీ కార్మికులు నిలదీస్తున్నారు.ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయడం తమిళనాడు ఘటనను గుర్తుకు తెస్తోంది. 2003లో జయలలిత 1.7 లక్షల మంది టీచర్లు, రెవెన్యూ ఉద్యోగులను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. న్యాయస్థానం సర్కారు నిర్ణయాన్ని సమర్థించింది. కానీ మానవతా దృక్పథంతో ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని సూచించింది. తిరిగి విధుల్లోకి చేరిన ఉద్యోగులు సమ్మె మాట ఎత్తబోమని ప్రభుత్వానికి మాటిచ్చారు.ప్రస్తుతం కేసీఆర్ ఇదే పట్టుదలను కొనసాగిస్తే.. తమిళనాట ఎదురైన పరిస్థితే ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. చర్చలు లేవు, ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేది లేదని కేసీఆర్ అంటుంటే.. ఆర్టీసీ కార్మికులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. సమస్య తీరును చూస్తుంటే.. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.2015లో ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి వారి అభిమానాన్ని చూరగొన్న కేసీఆర్.. ఇప్పుడు అదే ఆర్టీసీ కార్మికుల పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తామని.. నవ శకానికి నాంది పలుకుతామన్న కేసీఆర్ చేతుల్లోనే 48 వేల మంది ఆర్టీసీ సిబ్బంది భవితవ్యం ఉందనేది మాత్రం నిజం. కానీ పోరాటాలకు పెట్టింది పేరైన తెలంగాణ గడ్డ మీద.. ఆర్టీసీ సమ్మెకు వ్యతిరేకంగా కేసీఆర్ ఇంత దూకుడుగా ముందుకెళ్తుండటమే ఆశ్చర్యపరుస్తోంది

Related Posts