YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అ ఎంపీ... సూపర్

అ ఎంపీ... సూపర్

అ ఎంపీ... సూపర్
విశాఖపట్టణం, 
రాజకీయాల్లో కూడా పేదవాళ్ళు ఉంటారా. ఆ కాలం ఎపుడో పోయిందినా అని అనుకోవచ్చు. కానీ ఉంటారు. ఎక్కడో కాదు ఇంకా మన పక్కనే ఉన్న వారు ఎందరో. నిజాయతీకు మారుపేరుగా, మంచితనానికి అసలైన రూపంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎందరో ఉన్నారు. అందువల్లనే రాజకీయాలు ఈ మాత్రమైనా నడుస్తున్నాయనిపించకమానదు. ఇదిలా ఉండగా విశాఖ జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయి నాలుగు నెలలు దాటింది. కానీ ఆమె ఇప్పటికీ పెదరాలే. ఆమె గురించి చెప్పుకోవాలంటే ముందు ఆమె తండ్రి గురించి చెప్పాలి. ఆయన గొడ్డేటి దేముడు. దేవుడు అంటే విశ్వాసం లేని సీపీఐలో ఆయన రెండు మార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు దేవుడు అంటే ఎంత నమ్మకం వుందో తెలియదు కానీ గిరిజనులకు మాత్రం ఆయన దేవుడే. ఆయన మరణానంతరం ఆ కుటుంబం రాజకీయాలు ఊసే ఎత్తకుండా అతి సామాన్యులుగా బతుకుతూ వచ్చింది. ఆయన కూతురు గొడ్డేటి మాధవి ఓ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ పీఈటీగా పనిచేసేవారు. తండ్రి నుంచి రాజకీయ వారసత్వంగా ఆమెకు పేదలను సమాదరించడం వచ్చింది. బహుశా ఆ సామాజిక చైతన్యమే జగన్ కి నచ్చి ఉంటుంది.గొడ్డేటి మాధవిని అరకు నుంచి ఎంపీ చేస్తానని జగన్ చెప్పినపుడు ఆశ్చర్యపోవడం ఆ కుటుంబం వంతు అయింది తాను పోటీకి విముఖంగా ఉన్నా తాను గెలిపించుకుంటానని చెప్పి మరీ గెలిపించారు వైసీపీ అధినేత జగన్. గొడ్డేటి మాధవికి రికార్డు స్థాయి మెజారిటీ రావడమే కాదు, రాజకీయ కురువృధ్ధుడు, మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ని రెండున్నర లక్షల ఓట్ల తేడాతో ఓడించింది. ఇక గొడ్డేటి మాధవిని లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ చేస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లుగా కూడా ప్రచారం ఉంది. తొలిసారి లోక్ సభకు ఎన్నిక కావడం, పట్టుమని పాతికేళ్ళ వయసులో ఆమె పెద్దలున్న సభను నిభాయించలేరని వైసీపీ ఆ ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చినట్లుగా చెబుతారు.ఇక ఎంపీగా నెగ్గిన పిన్న వయస్కురాలు, అవివాహితురాలు అయిన గొడ్డేటి మాధవి ఇపుడు ఓ ఇంటివారు కాబోతున్నారు. ఆమె భర్త ఎవరో కాదు ఓ సామాన్య రైతు కుటుంబానికి చెందిన వారు. ఇక్కడే గొడ్డేటి మాధవి ప్రత్యేకత మరోసారి తెలుస్తోంది. ఆమె ఎంపీనని అహంభావంతో కాకుండా అనురాగంతో శివప్రసాద్ అనే వరుణ్ణి తన భర్తగా ఎంచుకుంది. గిరిజన సంప్రదాయంలో ఈ ఇద్దరి వివాహం ఈ నెల 17న విశాఖ జిల్లా శరభన్నపాలెంలో జరగనుంది. మరి ఈ పెళ్ళికి ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ హాజరవుతున్నారు. దేశంలోకి ఎంపీలోకెల్లా పేదరాలు అయిన మాధవి పెళ్ళి కూడా నిరాడంబరంగా జరుగుతుందని, పూర్తిగా గిరిజన సంప్రదాయంలో నిర్వహిస్తారని చెబుతున్నారు. మొత్తానికి గొడ్డేటి మాధవి గెలుపే కాదు, పెళ్ళి కూడా ఓ సంచలనం కావడం విశేషం.

Related Posts