
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ…ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమం
చిత్తూరు
చిత్తూరు జిల్లా కుప్పం , క్రిష్ణగిరి జాతీయ రహదారి లో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కుప్పం మండలం కనమపచ్చర్లపల్లికి చెందిన ధర్మతేజ (22) మంగళవారం రాత్రి తన ద్విచక్ర వాహనంలో కుప్పం వైపు వస్తుండగా ఎదురుగా కుప్పం వైపు నుండి వెండుగంపల్లికి ద్విచక్ర
వాహనంపై వెళ్తున్న మునిబాబును ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ధర్మ తేజ మృతిచెందగా మునిబాబు పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరిలించారు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.