ఆర్టీసి కార్మికుల డిస్మిస్ యోచనను విరమించుకోవాలి.
సిద్దిపేట,
సమ్మే చేస్తున్న ఆర్టీసి ఉద్యోగులను డిస్మిస్ చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలనిటిజేసి, టిపిటిఎఫ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, మంజీరా రచయితల సంఘం ప్రభుత్వాన్ని కోరాయి..ఈ మేరకు ఆయా సంఘాల ప్రతినిధులు జి. పాపయ్య, తిరుపతి రెడ్డి,పొన్నమల్ల రాములు,కె.రంగాచారి, సిద్దంకి యాదగిరి,అలాజ్ పూర్ శ్రీనివాస్, భగవాన్
రెడ్డి,తైదల అంజయ్య, కూతురు రాజిరెడ్డి, పెద్ది సుభాష్,నెల్లుట్ల వెంకట రమణారావు,అజయ్,తోట అశోక్ తదితరులు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.. తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మే చేస్తున్న ఆర్ టిసికార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను సామరస్య పూర్వకంగా పరుష్కరించాలితప్ప వారిని ఉద్యోగాలనుండి తొలగిస్తామనడం అప్రజాస్వామికమని తెలిపారు.. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలుపుతున్నట్టు తెలిపారు..ప్రభుత్వం భేషజాలకు పోకుండా కార్మికసంఘాల నాయకులతో నేరుగా చర్చలు జరపాలని.ప్రభుత్వ నిర్ణయం మూలంగా సుమారు 50 వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పఫైతుందని తెలిపారు..తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యములో ఆర్టీసికార్మికులు నిర్వహించిన పాత్రను మారువవద్దని తెలిపారు. ఎంతటి సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని అన్నారు..ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ సమాజం లో మరింత అలజడిని రేకెత్తించేదిగా ఉంది..ఇది ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంమానవతా దృక్పధం తొవ్యవహరించాలని, ఆర్టీసి ని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు.