ఏసీబీ కస్టడీకి ఈఎస్ఐ నిందితులు
హైద్రాబాద్,
ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితులకు రెండు రోజుల కస్టడీ విధించడానికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఆరుగురిని ఏసీబీ బుధవారం కస్టడీలోకి తీసుకుంది. వీరిని బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీసులో రెండు రోజుల పాటు విచారించనున్నారు.కస్టడీకి తీసుకున్న వారిలో ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణితోపాటు జాయింట్ డైరెక్టర్ పద్మజ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఫార్మాసిస్ట్ రాధిక, ఫార్మా కంపెనీ ప్రతినిధులు శ్రీహరి, నాగరాజు, హర్షవర్ధన్ ఉన్నారు. సోదాల్లో భాగంగా అరవింద్ రెడ్డి ఆఫీసులో దొరికిన డాక్యుమెంట్ల గురించి నిందితులను ఏసీబీ ప్రశ్నిస్తోంది.ఈ కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు. ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఏసీబీ అధికారులు మరికొంత మందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది