YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

విద్యార్థులకు వెలుగు- వైయస్సార్ కంటి వెలుగు "  - సుదర్శన్ రెడ్డి

విద్యార్థులకు వెలుగు- వైయస్సార్ కంటి వెలుగు "  - సుదర్శన్ రెడ్డి

విద్యార్థులకు వెలుగు- వైయస్సార్ కంటి వెలుగు "  - సుదర్శన్ రెడ్డి
వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమం పై ర్యాలీ.
నందవరం
మండల పరిధిలో విద్యార్థుల జీవితాలకు వెలుగు "వైఎస్ఆర్ కంటి వెలుగు" కార్యక్రమం అని మండల విద్యాధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. "వైయస్సార్ కంటి వెలుగు " కార్యక్రమం పై బుధవారం  మండల కేంద్రమైన నందవరము నందు వైద్య నిపుణులు డాక్టర్ నిర్మల ఆధ్వర్యంలో  ర్యాలీ నిర్వహించారు .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి సుదర్శన్రెడ్డి, 
డాక్టర్స్ నిర్మల, సౌజన్య లతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ మరియు ఉచిత శస్త్ర చికిత్సలు తదితర కంటి వైద్య సేవలు అందించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అంధత్వ నివారణ లక్ష్యంగా ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  "వైయస్సార్ 
కంటి వెలుగు "కార్యక్రమాన్ని రాష్ట్రంలో దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే మొదటి దశలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు మరియు వైద్య సేవలు అందించాలని నిర్ణయించారన్నారు .నేడు ప్రపంచ దృష్టి 
దినోత్సవం పురస్కరించుకొని శిక్షణ పొందిన వైద్య సిబ్బంది మరియు పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో నేటి నుండి ఈ నెల 16 వరకు  మండలములోని అన్ని ప్రభుత్వ మరియు ప్రవేటు పాఠశాలల విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలతో బాధపడు విద్యార్థిని విద్యార్థులకు తదుపరి దశలో సమగ్ర కంటి పరీక్షలు నిర్వహిస్తారన్నారు . 
ప్రాథమిక దశలో గుర్తించిన కంటి సమస్యలతో బాధపడు విద్యార్థులకు నిపుణులైన కంటి వైద్య సిబ్బంది చే కంటి వైద్య పరీక్షలు నవంబరు ఒకటో తారీకు నుండి నవంబర్ 30వ తేదీ వరకు నిర్వహించి  విద్యార్థులకు కంటి వైద్య సిబ్బంది చే కంటి అద్దాలు, అవసరమైతే శస్త్ర చికిత్సలు ఉచితముగా అందించబడును అని అన్నారు. కావున అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మేధావులు రాజకీయ నాయకులుఅన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని ఈ  వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమములో భాగస్వామ్యు లై  పిల్లలందరూ ఉచితంగా కంటి పరీక్షలు పొందేటట్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఇస్మాయిల్ ,క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఉరుకుందు,  హెల్త్ అసిస్టెంట్స్ ఉలిగమ్మ,సుధారాణి, ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు, విద్యా ,వైద్య సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు .

Related Posts