YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

యదేచ్చగా ప్లాస్టిక్ విక్రయాలు

యదేచ్చగా ప్లాస్టిక్ విక్రయాలు

యదేచ్చగా ప్లాస్టిక్ విక్రయాలు
హైద్రాబాద్, 
రాష్ట్రంలో ప్లాస్టిక్‌‌‌‌ వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్లాస్టిక్‌‌‌‌ కవర్లపై నిషేధం ఉన్నా, అది కాగితాలకే పరిమితమవుతోంది. ప్లాస్టిక్‌‌‌‌ కవర్ల తయారీదారులు, అమ్మకందారులపై అధికారులు అప్పుడప్పుడు మొక్కుబడిగా దాడులు నిర్వహించి, ఫైన్లతోనే సరిపెడుతున్నారు. షాపు ఓనర్లకు ఫైన్లు మామూలు స్థాయిలోనే ఉండడం, కవర్లు దొరుకుతుండటం, అవగాహన లేకపోవడం వల్ల కస్టమర్లు ఖాళీ చేతులతో షాపులకు, మార్కెట్లకు వస్తుండటంతో కవర్ల వాడకం తగ్గటం లేదు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సింగిల్‌‌‌‌ యూజ్ ప్లాస్టిక్‌‌‌‌ను అక్టోబర్‌‌‌‌ 2 నుంచి నిషేధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ పంద్రాగస్టు వేడుకల ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియాను 2022 వరకు ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు. ఈ నిషేధం అమలుకు గడువు దగ్గర పడుతుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కార్యాచరణను రూపొందించుకునే పనిలో పడ్డాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఈ విషయంపై ఇంకా ఎలాంటి కార్యాచరణ ఖరారు కాలేదు. అయితే, ‘‘ఆల్రెడీ మన రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై బ్యాన్ ఉంది. ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకునేందుకు గైడ్ లైన్స్ ఉన్నాయి. కొత్తగా కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న బ్యాన్‌పై కసరత్తు చేయాల్సింది ఏముంది?” అని అధికారులు చెబుతున్నారు.సింగిల్‌‌‌‌ యూజ్‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌పై ప్రధాని ప్రకటన చేయడానికి ముందే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్‌‌‌‌పై నిషేధం విధించాయి. దేశంలోనే తొలిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 23, 2018న నిషేధం విధించగా, ఆ తర్వాత నిషేధం ప్రకటించిన రెండో రాష్ట్రం తెలంగాణే. మన రాష్ట్రంలో జూన్‌‌‌‌ 14, 2018న సింగిల్‌‌‌‌ యూజ్‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌పై సర్కారు నిషేధం విధించింది. కానీ దీని అమలులో మాత్రం అధికార యంత్రాంగం చతికిలపడింది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం తాగునీటికి వాడే ప్లాస్టిక్  టెట్రాబాటిల్స్, సింగిల్ యూజ్ స్ట్రాలు, ప్లాస్టిక్ టీ కప్పులు/ కంటైనర్లు, 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వస్తువులకు నిషేధం వర్తిస్తుంది. అన్ని మున్సిపల్‌‌‌‌, గ్రామపంచాయతీల్లో వీటిని వాడరాదు. కానీ ప్లాస్టిక్‌‌‌‌ కవర్లు, ప్లాస్టిక్‌‌‌‌ గ్లాసుల తయారీ కంపెనీలు, హోల్‌‌‌‌సేల్‌‌‌‌ దుకాణాలు, కూరగాయలు, పండ్లు,  మాంసం, కిరాణా దుకాణాలు, ఫంక్షన్‌‌‌‌ హాళ్లను నియంత్రించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది.రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ప్లాస్టిక్‌‌‌‌ వ్యర్థాల్లో 80 శాతం వ్యర్థాలు హైదరాబాద్‌‌‌‌ నుంచే విడుదల కావడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌‌‌‌లో ఏటా సుమారు73 కోట్ల ప్లాస్టిక్‌‌‌‌ కవర్లు వాడుతున్నారు. రోజుకు సగటున 500 మెట్రిక్‌‌‌‌ టన్నుల ప్లాస్టిక్‌‌‌‌ వ్యర్థాలు విడుదలవుతున్నాయని అంచనా. రోజూ  విడుదలయ్యే వ్యర్థాల్లో 300 మెట్రిక్‌‌‌‌ టన్నులు సింగిల్‌‌‌‌ యూజ్‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌ వ్యర్థాలే కావడం గమనార్హం.  ఫలితంగా నగరంలో పర్యావరణ కాలుష్యంతోపాటు నదులు, చెరువులు, నీటి వనరులు కలుషితమవుతున్నాయి. హైదరాబాద్‌‌‌‌లో వాన పడితే చాలు ప్లాస్టిక్‌‌‌‌ కవర్లు, బాటిళ్లు నాలాల్లో గుట్టలుగుట్టలుగా పోగై వరద నీటికి అడ్డుగా నిలుస్తున్నాయి. వర్షపు నీరంతా రోడ్లపైకి చేరడంతో జనజీవనం స్తంభింస్తోంది. నాలాల్లో 40 శాతానికిపైగా ప్లాస్టిక్‌‌‌‌ వ్యర్థాలే ఉన్నట్లు గతంలో జేఎన్‌‌‌‌టీయూ ఇంజనీర్లు నిర్వహించిన అధ్యయనంలోనూ వెల్లడైంది.

Related Posts