YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అహం    ఆత్మ   దైవం

 అహం    ఆత్మ   దైవం

????????????????????????????????????????????????????????

????అహం    ????ఆత్మ  ???? దైవం

భ్రమరం మహా వృక్షాలను చెక్కలను మొద్దులను అవలీలగా తొలిచి రంధ్రాలు చేసి తాను జీవిస్తూ తన పిల్లలను కూడా అందులోనే పెంచి పోషిస్తుంది
అదే భ్రమరం మకరందం మీద ఆశతో తామరపువ్వుల మీద వాలినపుడు భయంతో తామరపూల రెక్కలు ముడుచుకొని భ్రమరాన్ని భంధించి వేస్తాయి
ఎంతో శక్తి కలిగి మహా వృక్షాలకు కూడా రంధ్రాలు చేసే ఆ భ్రమరం అయ్యో నన్నేదో బంధించింది అనే భావన కలిగి దానికి కలుగుతుంది
ఇ భావనే దానికి భయాన్ని కలిగిస్తుంది ఆ తామరపూవుల రెక్కలలోనే ఇరుక్కొని చివరకు చనిపోతుంది
అయితే ఇక్కడ మనం గమనిచాల్సివ విషయం ఒకటుంది అదేమిటంటే మహా వృక్షాలను కూడా తొలచగలిగే ఆ భ్రమరానికి ఆ తామరపూల రెక్కలను తొలచలేదా ఆ పూరేకులకు రంధ్రాలు చేయలేదా కనీసం తన రెక్కలను గట్టిగా ఆడించినా రాలిపోయే ఆ పూరేకుల మధ్య ఇరుక్కొని తన జీవితాన్ని ఎందుకు చాలించింది
అది తన సామర్థ్యాన్ని మరచిపోయి తనకంటే బలమైన శక్తేదో తనని బంధించిందనే భావన దానికి కలగడం ఆ భావనను అది నమ్మడమే దానిని బలహీనతకు దారితీసింది అది ఆ బలహీనతను పూర్తిగా నమ్మింది అంతే తన మరణాన్ని తానే కొనితెచ్చుకొంది 
మన జీవితంలో వచ్చే సమస్యలు కూడా ఇలాంటివే మనం ఎదుర్కొనే చాలా సమస్యలు బలమైనవికావు కానీ మన శక్తిని మనం మరచిపోవడంవల్ల అవి బలపడి మనలను బలహీనపరచి మనలను శక్తిహీనులను చేసి తాము బలపడి మనలను పూర్తిగా అబధ్రతా భావనలోనికి నెట్టివేస్తాయి
అలాగే మాయ అనేది మన ఆత్మశక్తి కంటే బలమైనదేమీ కాదు దాని బలం కేవలం తామర పూరేకులంతే కానీ నీ ఆత్మబలం మహా వృక్షాలకు రంధ్రాలు చేసేంత బలమైనది
ఈ విషయాన్ని సదా మననం చేసుకొంటూంటే ఎంత జఠిలమైన సమస్యలైనా నీ బలమైన ఆత్మవిశ్వాసం ముందు తలవంచుతాయి
కావున అహం అనేది ఆత్మస్వరూపం అయితే ఆ ఆత్మను నియత్రించగలిగే నీ ఆత్మబలమే దైవ స్వరూపం 
కాబట్టి ఎంత పెద్ద సమస్యనైనా నీ ఆత్మబలంతో సమర్థవంతంగా ఎదుర్కొని జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవడం మన చేతులలోనే ఉంది
నీవు దైవాన్ని నమ్ము ఆ దైవం నిన్ను సదా కాపాడుతుంది.
????????????????????????????????????????????????????????




Sent from my iPhone

Attachments area

Related Posts