YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

దొండపాడు ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్

దొండపాడు ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్

దొండపాడు ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్
సూర్యాపేట 
సూర్యాపేట జిల్లా చింతలపాలెం  మండలం దొండపాడు గ్రామంలో తెరాస ఎన్నికల ప్రచారం జరిగింది.  ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే ల్లయ్య యాదవ్., పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఇతరులు పాల్గోన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పెన్షన్లు వికలాంగులకు 500 నుంచి 3016 చేసినది సీఎం కెసిఆర్. ప్రతి ఒక్కరికి ఇచ్చిన 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు కూడా  సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి సహకరించండ ఎప్పుగూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకు రాలేదని అన్నారు. అడుగు పెట్టడానికి కూడా రోడ్లు లేని తుంగతుర్తి ఎందుకు అభివృద్ధి జరిగింది. ఎందుకు మిర్యాలగూడ అభివృద్ధిలో ముందు ఉంది. హుజూర్ నగర్ ఎందుకు వెనుకబడిందని మంత్రి ప్రశ్నించారు.  ఐదున్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జిల్లాలోనే నేను మంత్రి గా ఉన్న ఒక్కరోజు అంటే ఒక్క రోజు కూడా ఈ నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి వీటి పరిష్కారానికి సహకరించండని  ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కోరలేదని మంత్రి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశం పెడితే ఈ సమస్యను జిల్లా పరిషత్ సమావేశాలు నిర్వహిస్తే ఒక కార్యక్రమం నికి  కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాలేదు ప్రస్తుతం  ఏ రకంగా ఓటు అడిగే హక్కు  ఉన్నదో ఒకసారి ఆయనే ఆలోచన చేయాలి...  లేకపోతే ఒక రైతు బంధు ఒకసారి ఆలోచించండి ఆలోచన వచ్చిందా ఒక కేసీఆర్ 24 గంటల కరెంటు ఒక్కసారి ఆలోచించండని అయన అన్నారు.  హుజూర్ నగర్ లో బిజెపి-కాంగ్రెస్ ఒకటైనాయి.  తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ తెరాస. ఈ పార్టీ పుణ్యమా అని చెప్పే రెండు కేంద్ర పార్టీలు రెండు జాతీయ పార్టీలు ఒకటి అయినాయి. తెరాస అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి మీ వాడు 24 గంటలు మి వెంటే  ఉండే వాడు ఇక్కడే పుట్టిన వాడు. పెరిగిన వాడు.  విదేశాలకు పోయినా సరే వాస్తవానికి రాజకీయాలు వద్దని చెప్పినా నేను... ప్రజాసేవ చేయాలని మి సేవకై వచ్చాడు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. 

Related Posts