YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పది ఏళ్లు వెనక్కు వెళ్లిన రాష్ట్రం -మాజీ మంత్రి దేవినేని

పది ఏళ్లు వెనక్కు వెళ్లిన రాష్ట్రం -మాజీ మంత్రి దేవినేని

పది ఏళ్లు వెనక్కు వెళ్లిన రాష్ట్రం -మాజీ మంత్రి దేవినేని
విజయవాడ
ముఖ్యమంత్రి ఇ-ఐకేంద్రంగా 222 కేంద్రాలలో 67లక్షల మంది లబ్ధి పొందారు. సామాన్యుడికి, పేదవాడికి వరప్రసాదంగా చేసిన కార్యక్రమాన్ని, కంటివెలుగుగా ఆర్భాటం చేస్తున్నారు. పక్కరాష్ట్రం మీద ప్రేమతో, వాళ్ళ పధకాన్నే ప్రవేశపెట్టారు. కంటివెలుగు పక్కరాష్ట్రం నుంచి కాపీ చేశారాఅని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి టిటిడి రాజకీయాలకు వేదికగా మారుస్తున్నారు. బాబాయి, కొడుకు వేంకటేశ్వర స్వామి ఉచిత అన్న ప్రసాదాన్ని, స్వర్ణకుటీర్ కి తీసుకొచ్చి  5వేలమందికి పెట్టారు. దానంగా ఇచ్చిన స్వర్ణకుటీర్ ను అడ్డాగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని అయన విమర్శించారు. టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి స్వర్ణకుటీర్ ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నా. గతంలో టిటిడి సిబ్బంది వ్యతిరేకించిన అధికారిని ఎలా తీసుకొచ్చారు. ప్రతిపక్షంలో పింక్ డైమండ్ పోయిందన్న వైసిపికి ఇప్పుడు పింక్ డైమండ్ ఎలా కనిపించిందని ప్రశ్నించారు. వేంకటేశ్వర స్వామి నగలను ఆయనే కాపాడుకోవాలి. దాతలు టిటిడి నియమాల ప్రకారమే స్వర్ణకుటీర్ ను వినియోగించుకోవాలి, కానీ అడ్డాలుగా మార్చకూడదు. ట్రాన్స్పోర్ట్ యంత్రాంగం పెయిడ్ ఆర్టిస్టులా, ప్రభుత్వ ఉద్యోగులా. బాధ్యత కల ఉద్యోగులతో మీ స్టిక్కర్లంటించుకున్నారని ఆరో్పించారు. పంచాయితీలకు, సెప్టిక్ ట్యాంకులకు కాకుండా మీ ముఖాలకు రంగులు పూసుకోండి. 1300 కోట్లు ఎవడబ్బ సొమ్మని రంగులకు ఖర్చుపెట్టారు. వచ్చేవారం ఎలక్షన్ కమీషన్ ను కూడా కలుస్తాం, ఈ రంగుల మీద కంప్లైట్ చేస్తా. పక్క రాష్ట్రం మీద అభిమానం ఎంత ఎక్కువైపోయిందో రంగులు చెపుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టు టిడిపి హయంలో పూర్తిచేశాం. ఐదుగురు ముఖ్యమంత్రుల కష్టం ఉన్న పులిచింతల ప్రాజెక్టులో, 45 అడుగుల విగ్రహం పులిచింతలలో ఎలా పెడతారని అడిగారు. చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, వాటివద్ద కూడా పెద్దపెద్ద విగ్రహాలు పెడతారా. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పది సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. రాష్ట్రాన్ని కరెంటు కోతలతో అంధకారంలో పెట్టి కంటివెలుగు ఎలా తెస్తారు. 11రూపాయల 68పైసల
కి ఎంత కరెంటు  కొన్నారని నిలదీసారు.

Related Posts