పిడుగు పడి మృతి చెందిన అనురాధ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి
కొల్లాపూర్
కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో బుధవారం సాయంకాలం పిడుగు పడి మృతి చెందిన చుక్కా బాలస్వామి కూతురు డిగ్రీ పూర్తి చేసిన దళిత విద్యార్థిని అనురాధ మృత దేహానికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చి నిరుపేద అయిన బాలస్వామి కుటుంబానికి అండగా ఉంటానని
,ప్రభుత్వం నుండి అన్ని విధాలా సహాయం అందేలా కృషి చేస్తానని వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు .పిడుగు పడి మృతిచెందిన ఆవులను పరిశీలించారు, అక్కడి కి వచ్చిన అధికారులతో మాట్లాడి వెంటనే నివేదిక ఉన్నతాధికారులకు అందజేయాలని ఆదేశించారు. పిడుగు పడి మరణించిన వారికి ప్రభుత్వం నుండి 6 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా
వస్తుందని అవి అందేలా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ గాదెల సుధారాణి, ఎమ్మార్వో ,సర్పంచ్ మండ్ల కృష్ణయ్య, ఉపసర్పంచ్ సత్యనారాయణ, గంగ పుత్ర సంగం తాలూకా ప్రెసిడెంట్ ఆంజనేయులు, వార్డ్ నెంబర్లు బాల పీర్, మధు,రాజు, రాములమ్మ, టిఆర్ఎస్ పార్టీ,నాయకులు, కార్యకర్తలు వున్నారు