YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

టికెట్ ఇవ్వకుండానే డబ్బులు వసూలు చేస్తున్న ఆర్టీసీ కండక్టర్ లు

టికెట్ ఇవ్వకుండానే డబ్బులు వసూలు చేస్తున్న ఆర్టీసీ కండక్టర్ లు

టికెట్ ఇవ్వకుండానే డబ్బులు వసూలు చేస్తున్న ఆర్టీసీ కండక్టర్ లు
ఆసిఫాబాద్
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఆరవ రోజు గురువారం ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. తాత్కాలిక ఆర్టీసీ, ప్రైవేట్ బస్సు లోని కండక్టర్లు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు. అధిక డబ్బులు వసూలు పై ప్రయాణికులు ప్రశ్నిస్తే సత్వరమే బస్సు దిగిపోవాలని, లేకుంటే  తాము అడిగినంతా డబ్బులు ఇవ్వాల్సిందే నంటూ ఆదేశిస్తున్నారు. దీంతో ప్రయాణికులు గత్యంతరం లేక అధిక డబ్బులు చెల్లించి, బస్సులోనే తమ గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. కాగజ్నగర్ నుంచి సిర్పూర్ టీ, కాగజ్నగర్ నుంచి బెజ్జూర్, పెంచికల్పేట నుండి కాగజ్ నగర్ వైపు వెళ్లే ప్రైవేట్ బస్సుల లోని కండక్టర్లు ఒక్కొక్క ప్రయాణికులు నుండి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తూ ఎలాంటి టికెట్ ఇవ్వడం లేదని ప్రయాణికులు పేర్కొంటున్నారు.  
ప్రైవేట్ బస్సుల  యజమాన్యాలు అధికంగా ప్రయాణికులు అన్న మార్గాలలో నే బస్సులను నడిపిస్తున్నారు. తక్కువగా ప్రయాణికులు ఉండే మార్గాలలో బస్సులను నడిపేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
కౌటాల నుండి కాగజ్ నగర్ కు వచ్చే ప్రైవేట్ ఆర్టీసీ బస్సులో 20 మంది ప్రయాణికులు ఎక్కారు. కౌటాల నుండి కాగజ్ నగర్ కు చార్జి కింద ప్రతి ఒక్కరి నుండి 28 రూపాయలు వసూలు చేయాలి. బస్సులోని ప్రైవేట్ కండక్టర్ ప్రతి ఒక్కరి నుంచి 35 రూపాయలు వసూలు చేశారు. కండక్టర్ను ప్రశ్నిస్తే వసు దిగిపోవాలని ఆదేశించారు. గత్యంతరం లేక అధిక డబ్బులు ఇచ్చి  
బస్సులోనే కాగజ్నగర్ కు చేరుకోవాల్సి వచ్చిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Related Posts