YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అందరి జాతకాలు తెలుసు : చంద్రబాబు

అందరి జాతకాలు తెలుసు : చంద్రబాబు

అందరి జాతకాలు తెలుసు : చంద్రబాబు
విశాఖపట్టణం, 
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రౌడీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ పర్యటన సందర్భంగా తనకు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై చంద్రబాబు 
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ పోలీసులపై ధ్వజమెత్తారు.రాష్ట్రంలో రౌడీ ప్రభుత్వం నడుస్తోందని చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు కూడా ఇది నేరస్తుల ప్రభుత్వమని రుజువు చేశారన్నారు. సీఎం జగన్ ఓ నేరస్తుడు, ఆ నేరస్తుడు చెబితే పోలీసులు రెచ్చిపోతారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ భయపడే మనస్తత్వం తనది కాదన్నారు. మంచిగా ఉంటే మంచిగా ఉంటానని, తమాషాలు చేస్తే ఊరుకునేంది లేదంటూ హెచ్చరించారు. ఓడిపోయామని బాధపడాల్సిన పనిలేదని, ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదన్నారు.సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ తరువాత అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే వాళ్లకి రెడ్‌కార్పెట్ స్వాగతం పలికారన్నారు. అన్నీ గుర్తు పెట్టుకుంటానంటూ చంద్రబాబు హెచ్చరించారు. వైఎస్సార్సీపీకి కొమ్ముకాస్తున్నారని, అలాంటప్పుడు ఆ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అన్యాయంగా అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తల కోసం ఎంతవరకైనా వెళ్తానని చంద్రబాబు అన్నారు.రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను అణగదొక్కాలని చూస్తే మరింత రెచ్చిపోతారని వ్యాఖ్యనించారు. ఓడిపోయామని బాధపడాల్సిన పనిలేదని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తల కోసం నాలుగు నెలలుగా పోరాడుతున్నానని చంద్రబాబు అన్నారు. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోరాడుతుూనే ఉన్నానన్నారు. రాష్ట్రంలో తుపానులు వస్తే ఇక్కడే ఉండి అన్నీ 
చూసుకున్నానని, కానీ జగన్ విదేశాల్లో పర్యటించారని విమర్శించారు

Related Posts