YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

16, 30 తేదీల్లో సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు దర్శనం

16, 30 తేదీల్లో సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు దర్శనం

16, 30 తేదీల్లో సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు దర్శనం
తిరుమల,
వారి దర్శనానికి వచ్చే సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా టీటీడీ దర్శన ఏర్పాట్లు చేస్తోన్న విషయం తెలిసిందే. నెలలో రెండు రోజుల పాటు వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులోభాగంగా అక్టోబరు 15, 29 తేదీల్లో మంగ‌ళ‌వారం వయోవృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లు 
జారీ చేయనున్నారు. ఈ రెండు రోజుల్లో ఉదయం 10 గంటల స్లాట్‌కు 1,000, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటల స్లాట్‌కు 1,000 టోకెన్లు జారీ చేస్తారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ ప్రకటించింది.అలాగే ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు అక్టోబరు 16, 30 తేదీల్లో బుధవారం ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 1.30 గంటలకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ తెలిపింది.మరోవైపు, అక్టోబరులో టీటీడీ అనుబంధ ఆలయాల్లో పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. వాల్మీకిపురంలోని పట్టాభిరామ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు అక్టోబరు 12 నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. ఇందుకు అక్టోబరు 11న అంకురార్పణం నిర్వహిస్తారు. చంద్రగిరిలోని 
కోదండరామస్వామి దేవాలయంలో అక్టోబరు 19 నుంచి 21 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.అక్టోబరు 14 పౌర్ణమి గరుడసేవ, అక్టోబరు 21న తిరుమల నంబి ఉత్సవాలు, 26న నరక చతుర్దశి, వేదాంత దేశిక ఉత్సవం, అక్టోబరు 27 దీపావళి ఆస్థానం, కేదారగౌరీ వ్రతం, అక్టోబరు 30 తిరుమల నంబి సాత్తుమొర, అక్టోబరు 31న నాగుల చవితి వేడుకలు 
నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది.ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు రోజూ 1,400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. దీని వల్ల భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరవాత ఉదయం 10 గంటలకు, 
మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.

Related Posts