హనుమంత రెడ్డి సేవలు చిరస్మరణీయం..
సిద్ధిపేట
దివంగత రైతు నాయకుడు మారెడ్డి హనుమంత రెడ్డి సమాజానికి చేసిన సేవలు చిరస్థాయి గా నిలిచి ఉంటాయని వివిధ సంఘాల ప్రతినిధులు అన్నారు. గురువారం సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో ఇటీవల మరణించిన రైతుసంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు,తెలంగాణ ఉద్యమకారుడు మారెడ్డి హనుమంత రెడ్డి సంస్మరణసభ జరిగింది..సమావేశంలో తెలంగాణ ఐకాస
నాయకుడు జి. పాపయ్య, బీజేపీ నాయకుడు రాంచెందర్ రావు, సీపీఐ నాయకుడు వెంకట్రామిరెడ్డి,టీపీటీఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. తిరుపతి రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ సభ్యులు కె.అంజయ్య, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, మంజీరా రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రంగాచారి, తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్షుడు,తెలంగాణ రచయితల
ఉపాధ్యక్షుడు తోట అశోక్, మరసం ఉపాధ్యక్షుడు అలాజిపూర్, జర్నలిస్టు సంఘం నాయకుడు కూతురు రాజిరెడ్డి, రచయిత పప్పుల రాజిరెడ్డి, శ్రీనివాస్, జాతీయ సాహిత్య పరిషత్ ప్రతినిధి ఉండ్రాళ్ళ రాజేశం, సిద్ధిపేట రచయితల సంఘం అధ్యక్షుడు అమ్మన చంద్రా రెడ్డి, రైతుసంఘాల సమాఖ్య నాయకులు మారెడ్డి రామలింగారెడ్డి, మహిపాల్ రెడ్డి,రిటైర్డ్ ఉపాధ్యులు
అలాజ్ పూర్ లక్ష్మీ నారాయణ,టిఎన్జీఓస్ సంఘం నాయకుడు శ్రీహరి,వ్యవసాయ శాఖ ఏఓ పరశురాంరెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ మారెడ్డి హనుమంత రెడ్డి విద్యార్థి దశనుండే సామాజిక స్పృహతో పనిచేసాడని అన్నారు..విద్యార్థుల సమస్యలపై పోరాటం చేశాడని చెప్పారు..ఉపాద్యాయ వృత్తి చేపట్టిన తరువాత పిఆర్టీయు
ఉపాధ్యాయ సంఘం లో చురుకైన పాత్ర నిర్వహించి అంచెలంచెలుగా ఎదిగాడన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుని గా పనిచేసి ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేశాడని తెలిపారు. 2001 సంవత్సరం నుండి ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించాడని తెలిపారు. సిద్దిపేటలో జరిగిన తెలంగాణదీక్షశిభిరాన్నినడిపించాడన్నారు..ఒకవైపు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అవుతూనే మరోవైపు రైతు సమస్యలపై పోరాటం చేశాడని అన్నారు..ఆత్మహత్య లు చేసుకున్న
రైతు కుటుంబాల కు ప్రభుత్వం నష్టపరిహారం అందివ్వాలని పోరాడడ ని అన్నారు..రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టి కి తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషిచేసాడ ని తెలిపారు. మారెడ్డి హనుమంత రెడ్డి మరణం రైతు లోకానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు.. వివిధ రంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి
ఉంటాయన్నారు.