YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

చేజేతుల్లా చేసుకున్న రావెల

చేజేతుల్లా చేసుకున్న రావెల

చేజేతుల్లా చేసుకున్న రావెల
గుంటూరు, 
రావెల కిషోర్ బాబు… తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన ఘనత ఆయనకే దక్కుతుంది. అయితే రావెల కిషోర్ బాబు ఒక్క సారి ఎమ్మెల్యేగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రావెల కిషోర్ బాబుకు కనుచూపు మేరలో ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ లేదు. రావెల కిషోర్ బాబు చేజేతులా తన రాజకీయ జీవితానికి తానే ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నారన్నది వాస్తవం. కేవలం ఐదేళ్లలోనే మూడు పార్టీలు మారిన రికార్డు కూడా రావెల కిషోర్ బాబు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం విజయావకాశాలు లేని బీజేపీలో చేరిన రావెల కిషోర్ బాబు రాజకీయంగా ఆయనంతట ఆయనే సమాధి కట్టుకున్నారు.రావెల కిషోర్ బాబు 2014 ఎన్నికలకు ముందు ఎవరికీ తెలయరు. ఆయన ఒక ఐఆర్ఎస్ అధికారి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రిజర్వ్ డ్ నియోజకవర్గం కావడంతో రావెల కిషోర్ బాబు కు అప్పట్లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ సులువుగా దక్కింది. 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి గెలిచిన రావెల కిషోర్ బాబుకు సామాజిక వర్గాల సమీకరణల్లో భాగంగా మంత్రి పదవి కూడా ఇచ్చారు. సాధారణంగా మంత్రి పదవుల్లో సీనియారిటీని చూసే చంద్రబాబు రావెల విషయంలో దానిని పక్కన పెట్టారు.అయితే ప్రత్తిపాడు నియోజకవర్గంలో రావెల కిషోర్ బాబు ఒక సామాజిక వర్గాన్ని హర్ట్ చేశారు. వారు చెప్పినట్లు నడుచుకోకపోవడమే కాకుండా ఎదురు తిరగడం ప్రారంభించారు. దీనికి తోడు గుంటూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ జానీమూన్ తో కూడా రావెల కిషోర్ బాబుకు విభేదాలు తలెత్తాయి. రావెల కిషోర్ బాబు మంత్రి పదవిలో ఉండగానే ఆయన నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో చంద్రబాబుకు ఫిర్యాదు లందాయి. దీనికి తోడు మంద కృష్ణమాదిగతో చేతులు కలపడం కూడా మంత్రి పదవి ఊడటానికి ఒక కారణమయింది.ఇక టీడీపీ నుంచి ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన రావెల కిషోర్ బాబు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయలో రావెల కిషోర్ బాబు తనకంటూ ఒక వర్గాన్ని అక్కడ పెంపొందించుకోలేక పోయారు. ఇప్పుడు రావెల కిషోర్ బాబు బీజేపీలో చేరడం కూడా రాజకీయవేత్తగా ట్యాగ్ లైన్ ఉండటానికేనని, ఆయన ఎట్టిపరిస్థితుల్లో ప్రత్తిపాడు నుంచి గెలవలేరన్నది వాస్తవం. రావెల కిషోర్ బాబు ఇప్పుడునియోజకవర్గాన్ని మారిస్తే కొంత బెటర్ అని అంటున్నారు. అయితే నియోజకవర్గం మార్చినా ఇక ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం లేదు. అన్ని పార్టీలు దాదాపుగా ఆయన తిరిగి వచ్చేశారు

Related Posts