YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ తెరపైకి పోతిరెడ్డి లొల్లి

మళ్లీ తెరపైకి పోతిరెడ్డి లొల్లి

మళ్లీ తెరపైకి పోతిరెడ్డి లొల్లి
హైద్రాబాద్, 
పోతిరెడ్డిపాడు నీటి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఒకవైపు భారీ వరదలతో కృష్ణా ప్రాజెక్టులన్నీ నిండి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తుండగా మరో వైపు పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ఎక్కువగా నీటిని వినియోగిం చుకున్నదంటూ తెలంగాణ ఇంజినీర్లు వాదనకు దిగారు. కృష్ణా ప్రాజెక్టుల నీటి వినియోగంపై గురువారం స్థానిక జలసౌధలో జరిగిన రెండు రాష్ట్రాల ఇంజినీర్ల స్థాయి సమావేశంలో వాడి వేడి చర్చ జరిగింది. కృష్ణా బోర్డు ఇంజినీర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేస్తున్న పోతిరెడ్డి పాడు నీటి వినియోగంపై ఏపీ ఇంజినీర్లు చూపించిన లెక్కలను తెలంగాణ ఇంజినీర్లు తప్పుపట్టారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటి వరకూ లెక్కల్లో చూపించకుండా 18 టీఎంసీల నీటిని ఏపీ అక్రమంగా వినియోగించుకున్నదని వారు ఆరోపించారు. రికార్డుల్లో నమోదు చేసిన వాటి కన్నా కేవలం మూడు టీఎంసీల నీటిని మాత్రమే అదనంగా వినియోగించుకున్నామని ఏపీ ఇంజినీర్లు వెల్లడించారు. దీనిపై తెలంగాణ ఇంజినీర్లు వాస్తవ లెక్కలను వారి ముందుంచారు. కేసీ కెనాల్‌ నీటి విడుదలపై కూడా ఇదే రకమైన వాదన కొనసాగింది. అధికారికంగా చూపించిన లెక్కల కన్నా 8.5 టీఎంసీల నీటిని కేసీ కెనాల్‌ కింద ఏపీ అదనంగా విడుదల చేసిందని తెలంగాణ వాదించింది. తాము కేవలం 2.8 టీఎంసీల నీటిని మాత్రమే అదనంగా వినియోగించుకున్నామని ఏపీ ఇంజినీర్లు ఇచ్చిన వివరణతో తెలంగాణ ఇంజినీర్లు ఏకీభవించలేదు. పట్టిసీమ నీటి వినియోగంపై కూడా రెండు రాష్ట్రాల మధ్య రెండు రాష్ట్రాల ఇంజినీర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. పట్టిసీమ ద్వారా 21.97 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తాము తరలించామని, ఈ నీటిని కృష్ణా జలాల వినియోగ ఖాతాలో వేయవద్దని ఏపీ ఇంజినీర్లు కోరారు. దీనికి తెలంగాణ ఇంజినీర్లు అంగీకరించలేదు. కృష్ణాలో వరదనీరు ఎక్కువై సముద్రం పాలవుతుంటే పట్టిసీమ నీటిని తరలించాల్సిన అవసరం ఏముందని తెలంగాణ ఇంజినీర్లు ప్రశ్నించారు. మూడు ప్రధానమైన అంశాలపై రెండు రాష్ట్రాల ఇంజినీర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవటంతో ఈ నెల 15న జరిగే ఈఎన్‌సీల స్థాయి సమావేశంలో మళ్లీ వీటిపై చర్చించాలని నిర్ణయించారు. అదే రోజు వర్కింగ్‌ మాన్యువల్‌పై జరిగే బోర్డు సమావేశంలో కూడా నీటవి వినియోగంపై మరో మారు సమీక్షించాలని అభిప్రాయపడ్డారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ నీటి వినియోగం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ప్రాజెక్టుల వారీగా నీటి వినియోగం, యాసంగి అవసరాల కోసం నీటి విడుదల తదితర అంశాలపై చర్చ జరిగింది

Related Posts