YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

యాసంగికి రెట్టింపు సాగు

యాసంగికి రెట్టింపు సాగు

యాసంగికి రెట్టింపు సాగు
నిజామాబాద్, 
యాసంగిలో పంటల విస్తీర్ణం బాగా పెరగనుందనే అంచనాతో జిల్లా వ్యవసాయాధికారులు 2019 - 2020 యాసంగి ప్రణాళికను విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 70వేల 349 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయనున్నారని వ్యవసాయశాఖ అంచనా వేస్తూ యాసంగి ప్రణాళికను రూపొందించారు. గత ఏడాది యాసంగి విస్తీర్ణంతో పోలిస్తే ఈ ఏడాది యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం దాదాపుగా రెట్టింపు కానుంది. గత ఏడాది 2018 -2019 యాసంగిలో అన్ని రకాల పంటలు కలుపుకొని 1,40,842 ఎకరాలో సాగయ్యాయి. ఈ ఏడాది అది రెట్టింపు కానుంది.2019-2020 సీజన్ రైతులకు కలిసి వస్తున్నది. వానాకాలం సీజన్‌తో పాటు యాసంగి సీజన్ రైతులకు కొత్త ఉత్తేజాన్ని నింపనున్నది. వానాకాలం మొదట్లో వర్షాలు కు రవడంలో కాస్త ఆలస్యం జరిగినా, అనంతరం వా నలు సమృద్ధిగా కురిశాయి. దీంతో రైతులు పంట లను భారీగా సాగు చేశారు. పంట దిగుబడి కూడా భారీగా వస్తుందని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు అం చనా వేశాయి. వానాకాలం ముగింపు దశకు చేరు కోవడంతో ప్రభుత్వం జిల్లాల వారీగా యాసంగి సాగు ప్రణాళికను రూపొందించింది. దీంట్లో భా గంగా కామారెడ్డి జిల్లా యాసంగి సాగు ప్రణాళికను అధికారులు విడుదల చేశారు. ఆ గణంకాల ప్రకా రం జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి 2,70,349 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు వేశారు. గత ఏడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం రె ట్టింపు కానున్నది. ప్రభుత్వం ముం దస్తు జాగ్రత్త చర్యలో భాగంగా జిల్లాలో నీటి ల భ్యతను దృష్టిలో పెట్టుకొని యాసంగి ప్రణాళిక రూ పొందించింది. పంటల సాగుకు అనుగుణంగా కావాల్సిన ఎరు వులను అందుబాటులో ఉంచే విధంగా ప్రణా ళికలో పొందుపరిచారు.యాసంగి ప్రణాళిక విడుదల చేసిన అధికారులు, జిల్లాలో అత్యధికంగా వరి సాగు అవుతుందని అంచనా వేశారు. జిల్లాలో పుష్కలంగా వర్షాలు కురవడంతో దాదాపు అన్ని చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి. భూగర్భ జలాలు కూడా పెరగడంతో యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం రెట్టింపు కానుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తూ 2019 - 2020 యాసంగి ప్రణా ళికను రూపొందించారు. జిల్లాలో వరి లక్షా 19వేల 333 ఎకరాల్లో, మొక్కజొన్న 43,012 ఎకరాల్లో, శనగ 79,020 ఎకరాల్లో, వేరుశనగ 469 ఎకరాల్లో, గోధుమలు 2,013 ఎకరాల్లో, జొన్న 8,803 ఎకరాల్లో, పొద్దుతిరుగుడు 322 ఎకరా ల్లో, కుసుమలు 1124 ఎకరాల్లో, ఇతర పంటలు 16,253 ఎకరాల్లో సాగవుతాయని అం చనా వేశారు. దీంతో జిల్లాలో 2,70, 349 ఎకరా ల్లో పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు.సాగు విస్తీర్ణం రెట్టింపు అవుతుందనే అంచనాల మేరకు జిల్లా యాసంగి ప్రణాళికలో 2,70,349 ఎకరాల సాగు విస్తీర్ణానికి కావాల్సిన ఎరువులను ప్రణాళికలో వ్యవసాయాధికారులు పొందుపరిచా రు. ఈ ఏడాది యాసంగి పంటల ప్రణాళిక ప్రకా రం యూరియా 42, 420 మెట్రిక్ టన్నులు, డీఏ పీ 11,122 మె ట్రిక్ టన్నులు, ఎం వోపీ 2025 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్ ఎరువులు 15,114 మెట్రిక్ టన్నులు అవసరం అని అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది వానాకాలం పంటలు బాగా పండు తుండడంతో పాటు వచ్చే యాసంగి పంటలు సైతం అధిక విస్తీర్ణంలో సాగు వుతాయనే అంచనాల మేరకు జిల్లా వ్యవసాయాధి కారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.

Related Posts