మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ..
మచిలీపట్నం
మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా మచిలీప ట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇసుక కృత్రిమ కొరతకు నిరసనగా మచిలీపట్నం కోనేరు సెంటర్ వద్ద ఆయన తలపెట్టిన 36 గంటల దీక్షను భగ్నం చేశారు. తొలుత కొల్లు రవీంద్రను గృహ నిర్బంధం చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. అప్పటికే వేరే మార్గంలో కోనేరు సెంటర్కు రవీంద్ర
చేరుకున్నారు. అక్కడ బలవంతంగా ఆయనను అరెస్ట్ చేశారు. మచిలీపట్నం సెంటర్లో నిరసన దీక్షకు దిగనున్నట్టు ముందుగానే ప్రకటించారు కొల్లు రవీంద్ర... దీంతో టీడీపీ శ్రేణులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ముందస్తు అరెస్ట్లు చేశారు. అరెస్ట్ సమయంలో పోలీసులకు, తెదేపా తలకు మధ్య తోపులాట
జరిగింది. అంతకు ముందు ఆయన నిరసన దీక్షకు వెళ్లకుండా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో పాటు మాజీ ఎమ్మెల్యేలను, మరికొందరు ముఖ్యనేతలను అదుపులోకి తీసుకున్నారు. అయితే, అరెస్ట్లపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.. శాంతియుతంగా ఇసుక కొరతను
ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే.. అరెస్ట్లు ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు