YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అక్టోబరు నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

అక్టోబరు నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

అక్టోబరు నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి 
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.  వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

- అక్టోబరు 13న పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నారు.
- అక్టోబరు 18న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అనంతరం ఆస్థానం నిర్వహిస్తారు.
- అక్టోబరు 21న శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం.
- అక్టోబరు 22న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.
- అక్టోబరు 21న శ్రీ మానవాల మహాముని ఉత్సవారంభం.
- అక్టోబరు 25న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
- అక్టోబరు 27న సాయంత్రం 5.30 గంటలకు దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు.
- అక్టోబరు 30న తిరుమల నంబి సాత్తుమొర.

Related Posts