కడప కొత్త ఎస్పీగా అన్బు రాజన్
కడప
పాత కేసులు పురోగతి పై దృష్టి పెడతా. వాటి పరిష్కరానికి చర్యలు తీసుకుంటాం. నగరంలో ట్రాఫిక్ పై దృష్టి సారిస్తాను. ధైర్యంగా సమస్య ఉంటే నేరుగా స్టేషన్ కి రావచ్చని జిల్లా నూతన ఎస్పీ అన్బు రాజన్ అన్నారు. కడప ఎస్పీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన తరువాత అయన మీడియాతో మాట్లాడారు. గత ఎస్పీ అభిషేక్ మొహంతి సుదీర్ఘ సెలవు పై వెళ్లడంతో ఎస్పీగా అన్బురాజన్ వచ్చారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ను మరింత టెక్నాలజీ ఉపయోగించి నేరాలను అరికడతాం. చట్టాన్ని వ్యతిరేకిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇసుక అక్రమ రవాణా, మట్కా, ఇతర చట్ట వ్యతిరేక కలపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. వైఎస్ వివేకా హత్య కేసు పై త్వరలో సమీక్ష జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తానని అన్నారు.