YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

*మేఘా కంపెనీ ఐటి సోదాల్లో, భారీగా అక్రమాలు గుర్తింపు... షేక్ అవుతున్న ఏపి, తెలంగాణా బినామీలు ?*

*మేఘా కంపెనీ ఐటి సోదాల్లో, భారీగా అక్రమాలు గుర్తింపు... షేక్ అవుతున్న ఏపి, తెలంగాణా బినామీలు ?*

*మేఘా కంపెనీ ఐటి సోదాల్లో, భారీగా అక్రమాలు గుర్తింపు... షేక్ అవుతున్న ఏపి, తెలంగాణా బినామీలు ?*
రెండు తెలుగు రాష్ట్రాలను శాసిస్తున్న, కాంట్రాక్టర్ అయిన మేఘా కంపెనీ పై, దేశ వ్యాప్తంగా ఐటి దాడులు చెయ్యటం పెను సంచలనంగా మారింది. మేఘా కృష్ణా రెడ్డి అటు కేసిఆర్ కి, ఇటు జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాని, మొన్న పోలవరంలో సింగల్ టెండర్ వేసి, ప్రాజెక్ట్ తీసుకోవటం కాని, ఇలా ప్రతి దాంట్లో మేఘా ఉంటుంది. అలాగే ఎన్నికల సమయంలో, మేఘా నుంచి, పెద్దిరెడ్డి కంపెనీకి అధికంగా నిధులు వచ్చాయని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే తెలంగాణాలో ఎలెక్ట్రిక్ బస్సులు, ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్న మేఘా, ఆంధ్రప్రదేశ్ లో కూడా, దానికే ఎలెక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టు ఇస్తున్నారని, తెలుగుదేశం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.ఒక పక్క పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్ళ వద్దు అని కేంద్రం అంటున్నా, జగన్ వెళ్లి, మేఘాకు కాంట్రాక్టు ఇవ్వటంతో కేంద్రం గుర్రుగా ఉంది. వీటి అన్నిటి నేపధ్యంల్,మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి నివాసంతో పాటుగా, ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ రోజు ఐటి దాడులు మొదలయ్యాయి. ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఇన్వెస్టిగేషన్‌ వింగ్‌ ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  సోదాల్లో భారీగా అక్రమ లావాదేవీలు బయట పడ్డాయని, పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారని, ఫేక్ బిల్లులు పెట్టి వేల కోట్లు కొల్లగొట్టినట్టు తేలిందని, చెప్తున్నారు. అయితే పూర్తీ వివరాలు వస్తే కాని, ఎంత మొత్తంలో ఈ అక్రమాలు జరిగాయి అనేది తెలిసే అవకాశం ఉంది.మేఘా కంపెనీలో ఇరు రాష్ట్రాల ప్రముఖులు బినామీలుగా ఉన్నారని, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మేఘానే డబ్బులు సద్దిందని, రాజకీయ విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. అయితే ఈ ఐటి దాడులు రాజకీయంగా కూడా చూడాలని విశ్లేషకులు అంటున్నారు. కేసిఆర్, జగన్, బీజేపీ పై ఉమ్మడిగా రాజకీయ పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారనే సమాచారం రావటంతోనే, ఇలా చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. 
అదీ కాక ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి, హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావాల్సి ఉంది. అయితే ఈ రోజు ఈ అపాయింట్మెంట్ కాన్సిల్ అయ్యింది. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అమిత్ షా ని కలిసే ప్రయత్నం చేసినా కుదరలేదు. అయితే ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా రద్దు చెయ్యటం, మేఘా పై ఐటి రైడ్స్ చూస్తుంటే, ఎన్నికల ముందు, మాకు జరిగిన సీన్స్ గుర్తుకు వస్తున్నాయి అని తెలుగుదేశం పార్టీ అంటుంది.

Related Posts