ద్వారకా తిరుమలలో సౌకర్యాలు కల్పించాలి
ఏలూరు,
ద్వారాకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణమహోత్సవాల్లో పాల్గొంటానని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. స్థానిక శ్రీరామ్ నగర్ లోని మంత్రి కేంపు కార్యలయంలో శుక్రవారం ద్వారాకా తిరుమల దేవస్థానం ఇఒ దంతులూరి పెద్దిరాజు దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటిల్ ఇంజనీర్ త్వవలం సూర్యనారాయణ, తదితరులు ఆళ్ల నానిని కలిసి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఈ నెల 12 తేదిన రధోత్సవం 13వ తేదిన జరుగనున్నదృష్ట్యా ముఖ్యఅతిధిగా హాజరుకావాలని కోరారు. దీనిపై నాని స్పందిస్తు ఇప్పటికే ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శించుకుంధామని అనుకున్నానని ఈ కళ్యాణ మహోత్సవాలలో తప్పనిసరిగా పాల్గొంటానని చెప్పారు. అందరికీ ఆరాధైవ్యంగా నిలిచిన చిన వెంకన్న స్వామి వారి దర్శనం చేసుకోవడం జరుగుతుందని, కాని స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంల్లో పాల్గొనే అవకాశం కలుగడం తన అధృష్టంగా భావిస్తానని నాని చెప్పారు. ఇప్పడికిప్పుడే చిన తిరుపతికి భక్తులతో పాటు పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా వస్తున్నారని దానికి అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలని నాని చెప్పారు