YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

అక్క కాపురంలో నిప్పులు పోసిన చెల్లెలు

అక్క కాపురంలో నిప్పులు పోసిన చెల్లెలు

అక్క కాపురంలో నిప్పులు పోసిన చెల్లెలు
భోపాల్, 
రక్తం పంచుకు పుట్టిన అక్క సంసారాన్ని నాశనం చేసిందో యువతి. చదువు పేరుతో అక్క ఇంటికొచ్చిన ఆమె బావపైనే మనసు పడింది. అతడు తన అక్కకు పంచుతున్న ప్రేమ తనకూ కావాలని ఆశపడింది. అనుకున్నదే తడవుగా బావను ముగ్గులోకి దించింది. అతడికి పడక సుఖం అందించి తన వైపునకు తిప్పుకుంది. చివరకు ఓ రోజు బెడ్‌రూమ్‌లో బావతో రాసలీలలు సాగిస్తుండగా అక్క కంటపడింది.మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన సంగీతకు కొద్ది నెలల క్రితం గ్వాలియర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. పట్టణంలో ఉంటే బాగా చదువుకోవచ్చన్న ఆలోచనతో ఆమె తన చెల్లెలిని కూడా అత్తింటికి తీసుకొచ్చింది. సంగీత భర్త మరదలిని మంచి కాలేజీలో చేర్పించి, అన్ని పనులు చక్కబెట్టాడు. మరదలికి ఏ లోటూ లేకుండా చూసుకునేవాడు. భర్త తన చెల్లెలిపై చూపిస్తున్న కేరింగ్ చూసి మురిసిపోయిన సంగీత.. అదే తన సంసారాన్ని నాశనం చేస్తుందని ఊహించలేకపోయింది.అన్ని విషయాల్లో చురుగ్గా ఉండే బావపై సంగీత చెల్లి మనసు పారేసుకుంది. అతడు అక్కకు పంచే ప్రేమ తనకు కూడా కావాలనుకుంది. దీంతో చదువు పక్కనబెట్టి బావను ముగ్గులోకి దించే పనిలో పడింది. ఇంట్లో అతడికి అన్ని పనులు చేస్తూ చనువు పెంచుకుంది. ఓ రోజు అక్క ఇంట్లో లేని సమయంలో అతడికి మద్యం తాగించి పడక సుఖాన్ని అందించింది. దీంతో అతడికి మరదలిపై సంగీత భర్తకు మనసు మళ్లింది. రోజూ మరదలిని కాలేజీ సాకుతో బయటకు తీసుకెళ్లి రాసలీలలు జరిపేవాడు. శుక్రవారం సంగీత పని నిమిత్తం బయటకు వెళ్లడంతో బావా మరదలికి ఏకాంత సమయం దొరికింది. దీంతో బెడ్‌రూమ్‌లోనే కామక్రీడలు మొదలుపెట్టేశారు. ఈలోగా ఇంటికి వచ్చిన సంగీత ఇంట్లో నుంచి ఏవో రొమాంటిక్ మాటలు వినిపించాయి. అనుమానంతో కిటికీలో నుంచి చూసి షాకైంది. తన భర్త, చెల్లి మంచంపై సాగిస్తున్న రాసలీలలు చూసి ఆమె గుండె బద్దలైంది. ఇద్దరూ కలిసి తనను దారుణంగా మోసం చేసిన విషయాన్ని గుర్తించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు స్కెచ్ వేసింది. చుట్టుపక్కల వారందరినీ పిలిచి వారి సమక్షంలో తలుపు తట్టింది. దీంతో ఎటూ పాలుపోని బావా మరదళ్లు తలుపు తీయక తప్పలేదు. వారిద్దరిని చూసి ఆగ్రహంతో రెచ్చిపోయిన సంగీత దేహశుద్ధి చేసింది. స్థానికులు కూడా వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. బావా మరదళ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.

Related Posts